Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వైయస్సార్టీపీలో కమిటీలన్నీ రద్దు.. షర్మిల సంచలన నిర్ణయం!

వైయస్సార్టీపీలో కమిటీలన్నీ రద్దు.. షర్మిల సంచలన నిర్ణయం!
ఇప్పటి వరకు ఉన్న అన్ని కమిటీలను రద్దు చేసిన షర్మిల
జిల్లాలకు కోఆర్డినేటర్ల నియామకం
గ్రేటర్ హైదరాబాద్ కోఆర్డినేటర్ గా వడుక రాజగోపాల్

వైయస్సార్ టీపీ కమిటీలను రద్దు చేస్తూ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల నిర్ణయం తీసుకున్నారు .దీంతో ఒక్కసారిగా ఆమె నిర్ణయంపై జిల్లాల అధ్యక్షలు కమిటీ సభ్యులు అయోమయం లో పడ్డారు . కమిటీలను నియమించి నెలలు కూడా గడవక ముందే రద్దు చేయడం ఏమిటి అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరో పక్క వైయస్ఆర్ టీపీని ఎన్నికల సంఘం గుర్తించేందుకు నిరాకరించిందని కూడా వార్తలు వచ్చాయి. కారణం ఏదైనా వేసిన కమిటీలను రద్దు చేయడం కొత్తగా కో ఆర్డినేటర్లను నియమించడంపై ఆపార్టీ వారే పెదవి విరుస్తున్నారు .

తెలంగాణలో వైయస్సార్టీపీ తన కార్యకలాపాలను విస్తృతం చేస్తోంది. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. పార్టీని ప్రక్షాళన చేసే క్రమంలో ఇప్పటి వరకు ఉన్న అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్టు ఆ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రకటించారు. కమిటీల స్థానంలో జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమిస్తున్నట్టు ఆమె తెలిపారు.

గత ఏడాది పార్టీని ప్రకటించిన తర్వాత పార్లమెంటు నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను నియమించారు. రాష్ట్ర స్థాయిలో అధికార ప్రతినిధులను, సోషల్ మీడియా ఇన్చార్జీలను నియమించారు. అయితే ఇప్పుడు అన్ని కమిటీలను ఒక్కసారిగా రద్దు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

గ్రేటర్ హైదరాబాద్ కోఆర్డినేటర్ గా వడుక రాజగోపాల్, రంగారెడ్డి జిల్లాకు ఎడమ మోహన్ రెడ్డి, ఖమ్మం జిల్లాకు గడిపల్లి కవిత, వికారాబాద్ జిల్లాకు తమ్మాలి బాలరాజ్, నల్గొండ జిల్లాకు ఇంజం నర్సిరెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాకు మహమ్మద్ అత్తార్ ఖాన్, ములుగు జిల్లాకు రామసహాయం శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు నాడెం శాంతికుమార్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు అప్పం కిషన్, నిజామాబాద్ జిల్లాకు నీలం రమేశ్, ఆదిలాబాద్ జిల్లాకు బెజ్జంకి అనిల్ కుమార్ తదితరులను కోఆర్డినేటర్లుగా నియమించారు.

Related posts

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ అధ్యక్షతన అఖిపక్షం….

Drukpadam

చంద్రబాబు ఖమ్మం శంఖారావం సభపై  నిప్పులు కురిపించిన బీఆర్ యస్ మంత్రులు  !

Drukpadam

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి: శశిథరూర్…

Drukpadam

Leave a Comment