డోలి కళాకారుడు ఆదివాసీ ఆణిముత్యం ప్రదశ్రీ గ్రహీత సకిని రామచంద్రయ్య కు ఘనసన్మానం!
-ఆదివాసీ ముద్దుబిడ్డకు అరుదైన గౌరవం
-కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు పలువురి అభినందనలు
*మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన…. డోలి కళాకారుడు… ఆదివాసీ ఆణిముత్యం సకిని రామచంద్రయ్య కేంద్ర ప్రభుత్వం అరుదైన పద్మశ్రీ అవార్డు ప్రకటించి గౌరవం ఇచ్చింది. ఇది మొత్తం ఆదివాసీ ప్రాంతానికి , ఆదివాసీ బిడ్డలకు ఇచ్చిన గౌరవం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. …. ఏజెన్సీ ప్రాంతమైన మణుగూరు కు ఢిల్లీ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన… ” సకిని రామచంద్రయ్య పలువురు సన్మానించారు . ” “పద్మశ్రీ” అవార్డు కు ఎంపికైన సందర్భంగా. వారిని శాలువాతో సన్మానించి అభినందించిన వారిలో అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని సుజాత,జడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ ఉన్నారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీ కళాకారుడి నైపుణ్యాన్ని గుర్తించి అరుదైన గౌరవం ఇచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతన్జ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్,ఎస్కె ఖదీర్,మణుగూరు వైస్ ఎంపీపీ కెవిఆర్ ,అశ్వాపురం మండల తెరాస ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి,ఎంపీటీసీల సంఘం అశ్వాపురం మండల అధ్యక్షులు కమటం నరేష్,గొల్లగూడెం ఎంపీటీసీ ఎనిక రవి,సమితి సింగారం ఉపసర్పంచ్ పుచ్చకాయల శంకర్,మణుగూరు,అశ్వాపురం మండల నాయకులు సూదిరెడ్డి గోపిరెడ్డి,ఆచంట సాయి,మాదాడి రాజెష్,ఎన్వీర్ ,వలబోజు మురళీకృష్ణ,పర్వత నరేష్,పిట్ట శ్రీనివాసరావు,సవలం అనిల్ కుమార్,సూరా రాజు తదితరులు పాల్గొన్నారు.