అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా సోకింది: చిరంజీవి
- తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయి
- నిన్న రాత్రి కరోనా పరీక్ష చేయించుకున్నా
- పాజిటివ్ గా నిర్ధారణ అయిందన్న మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా చిరంజీవి వెల్లడించారు. తాను అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా సోకిందని చెప్పారు. తనకు తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉండడంతో నిన్న రాత్రి కరోనా పరీక్ష చేయించుకున్నానని, దీంతో పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయన అన్నారు.
ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారందరూ వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. త్వరలోనే కోలుకుని మళ్లీ అందరినీ కలుస్తానని చెప్పారు. కాగా, టాలీవుడ్‌లో ఇప్పటికే పలువురు ప్రముఖులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో వారి షూటింగులకు బ్రేక్ పడింది.
ఇదిలావుంచితే, చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో చిరంజీవి ‘ఆచార్య’ సినిమా విడుదలను వాయిదా వేసిన టీమ్.. కొత్త విడుదల తేదీని ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ 1న ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపింది.