Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప మనవరాలు ఆత్మహత్య!

కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప మనవరాలు ఆత్మహత్య!

  • ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సౌందర్య
  • డాక్టర్ గా పని చేస్తున్న సౌందర్య
  • 2019లో డాక్టర్ నీరజ్ తో వివాహం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మనవరాలు సౌందర్య నీరజ్ (30) ఆత్మహత్య చేసుకున్నారు. బెంగళూరులోని వసంతనగర్ లోని అపార్ట్ మెంటులో నివసిస్తున్న ఆమె ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో ఆమె వైద్యురాలిగా పని చేస్తున్నారు. యడియూరప్ప పెద్ద కుమార్తె పద్మ కూతురే సౌందర్య.

2019లో డాక్టర్ నీరజ్ తో ఆమె వివాహం జరిగింది. వీరికి ఒక పాప కూడా ఉంది. పని మనిషి ఈ ఉదయం 10 గంటలకు సౌందర్య ఇంటికి వెళ్లి తలుపు తట్టగా… ఎంత సేపటికీ తలుపు తెరుచుకోలేదు. దీంతో, వెంటనే నీరజ్ కు ఫోన్ చేశారు. హుటాహుటిన నీరజ్ ఇంటికి వచ్చారు.

ఆ తర్వాత తలుపులను తెరిచి లోపలకు వెళ్లగా సీలింగ్ ఫ్యాన్ కు ఆమె వేలాడుతూ కనిపించింది. ప్రాథమిక ఆధారాలను బట్టి కేసును ఆత్మహత్యగా పోలీసులు నమోదు చేశారు. మరోవైపు కుటుంబ కలహాల నేపథ్యంలో గత కొంత కాలంగా సౌందర్య డిప్రెషన్ లో ఉన్నారని తెలుస్తోంది.

Related posts

యూపీ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషిపై రాజద్రోహం కేసు…

Drukpadam

దిల్ రాజు అల్లుడి లగ్జరీ కారు చోరీ..గంటపాటు పోలీసులకు టెన్షన్!

Ram Narayana

సిద్ధిపేటలో కాల్పులు జరిపి రూ.43 లక్షలు దోచుకెళ్లిన దుండగులు!

Drukpadam

Leave a Comment