Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కొత్త జిల్లాలు ఒక డ్రామా: చంద్రబాబు…

కొత్త జిల్లాలు ఒక డ్రామా: చంద్రబాబు…
-సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే నాటకాలు
-త్వరలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
-పార్టీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం
-ఏపీపై కేంద్రం దృష్టి సారించాలని సూచన
-రాష్ట్రం అంధకారంలోకి వెళుతోందని వ్యాఖ్యలు

ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. త్వరలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ఇవాళ టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా వైసీపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఏపీ సర్కారు తీరుపై కేంద్రం దృష్టి పెట్టాలని కోరారు. సర్కారు ఆర్థిక ఉల్లంఘనలతో రాష్ట్రం అంధకారంలోకి వెళుతోందని విమర్శించారు.

28 మంది వైసీపీ ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం తెచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఎవరి కోసం? అని నిలదీశారు. పాలన అంటే అప్పు చేయడం, దోచుకోవడం అన్నట్టుగా మారిందని అన్నారు. సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే కొత్త జిల్లాల డ్రామా మొదలుపెట్టారని వ్యాఖ్యానించారు. ఇది కేవలం నాటకం మాత్రమే అని విమర్శించారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఉద్యోగుల సమస్యలపై ఆందోళన జరుగుతున్నా వేళ కొత్త జిల్లాలు అంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు . రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటిపరిష్కరంలో శ్రద్ద పెట్టడంలేదు . సమస్యలు పరిష్కరించే సామర్థ్యం ఈ ప్రభుత్వానికి లేదు . ఎంతసేపటికి ప్రత్యర్థులపై పోలీసులను ఉపయోగించి కేసులు పెట్టడమే అలవాటుగా మారింది. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు దారితప్పాయి. ప్రతిపక్ష పార్టీ ల కార్యకర్తలే లక్ష్యంగా భౌతిక దాడులు జరుగుతున్నాయిఅని చంద్రబాబు ధ్వజమెత్తారు .

Related posts

వైఎస్ జగన్‌పై మరో కేసు…

Drukpadam

మీ ప్రతాపం… దమ్ముంటే నాపై చూపండి: వైసీపీ నేతలపై జనసేనాని ఫైర్

Drukpadam

తడబాటులో పొరపాటు …చంద్రబాబును విమర్శించబోయి జగన్ ను విమర్శించిన మంత్రి!

Drukpadam

Leave a Comment