Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ ఎంపీలతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం!

టీఆర్ఎస్ ఎంపీలతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం!
-రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు
-టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం
-సభలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చ
-23 అంశాలతో కూడిన బుక్ లెట్ ఎంపీలకు అందజేత

రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలతో చర్చించారు. కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. కాగా, కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన వివిధ అంశాలపై ప్రభుత్వం ఓ నివేదిక రూపొందించింది. నేటి సమావేశంలో ఈ నివేదికను సీఎం కేసీఆర్ ఎంపీలకు అందజేశారు. పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలే పరమావధిగా కృషి చేయాలని సూచించారు.

సీఎం కేసీఆర్ తో సమావేశం ముగిసిన అనంతరం ఎంపీ రంజిత్ రెడ్డి స్పందించారు. ఈ సమావేశంలో 23 అంశాలను చర్చించామని, ఆ అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతామని తెలిపారు. ఉభయ సభల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ తమకు ఓ బుక్ లెట్ అందించారని వెల్లడించారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై సీఎం కేసీఆర్ ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశారని, బడ్జెట్ కూర్పు చూశాక రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం పోరాడతామని అన్నారు. విభజన అంశాలను కూడా పార్లమెంటులో లేవనెత్తుతామని చెప్పారు.

ఈ సమావేశంలో రాజ్యసభలో టీఆర్ఎస్ పార్టీ పక్షనేత కె.కేశవరావు, లోక్ సభ లో టీఆర్ఎస్ పార్టీ పక్షనేత నామా నాగేశ్వర రావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మికాంత రావు, కె.ఆర్.సురేష్ రెడ్డి, జోగినిపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, లోక్ సభ సభ్యులు బి.బి.పాటిల్, పి.రాములు, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, వెంకటేశ్ నేత, మాలోత్ కవితా నాయక్, కొత్త ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రాణాలైనా ఇచ్చేస్తా కానీ బీజేపీతో మళ్లీ చేతులు కలపను: బీహార్ సీఎం నితీశ్ కుమార్!

Drukpadam

దేవినేని ఉమ వాహనంపై రాళ్లదాడి… చంద్రబాబు పరామర్శ!

Drukpadam

రాజ్య‌స‌భ‌లో టీఆర్ఎస్ ప‌క్షం బీజేపీలో విలీనం కాబోతోంది: రేవంత్ రెడ్డి

Drukpadam

Leave a Comment