ప్రాణాలమీదకు తెచ్చుకున్న జిలుగు కల్లు: ఏపీలో కల్తీ కల్లు తాగి ఐదుగురి మృతి!
-తూర్పుగోదావరి జిల్లా లోదొడ్డి గిరిజన గ్రామంలో విషాదం
-జీలుగు కల్లు తాగి ఐదుగురి దుర్మరణం
-తాగిన వెంటనే వికటించిన కల్లు
గిరిజనులు అటవీ ప్రాంతంలో లభ్యమైయ్యే అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని ఆహారంగా తీసుకుంటారు .మిగిలిన వాటిని అమ్మటం కూడా చేస్తుంటారు . వాస్తు మార్పిడి ఇప్పటికి గిరిజన ప్రాంతాలలో కొనసాగుతుంది.వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని అనేకమంది వ్యాపారులు పట్టణాలనుంచి తీసుకోని పోయిన కల్తీ సరుకులను వారికీ అంటగట్టి వారి వద్ద నుంచి అడవులలో సేకరించిన నాణ్యమైన వస్తువులు కారుచౌకగా తెచ్చుకుంటారు . చింతపండు ,పనస , బంక లాంటివి వారు సంతల్లో వ్యాపారులకు ఇస్తుంటారు .వారికీ అడవుల్లో లభ్యమైయ్యే కల్లు తాగడం అలవాటుగా మారింది. ఇప్పపువ్వు సారాయి కచ్చితాగుతుంటారు .జిలుగు చెట్ల నుంచి కల్లు సేకరించి తాగుతుంటారు . కల్లు ఏమి కలిసేందో ఎందుకు ఇలా జరిగిందో తెలియదుకాని జిలుగు కల్లు తగిన ఐదుగురు మరణించిన సంఘటన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకున్నది .
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కల్తీ జీలుగు కల్లు తాగి, ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన రాజవొమ్మంగి మండలంలోని లోదొడ్డి గిరిజన గ్రామంలో చోటుచేసుకుంది. మృతులందరూ గిరిజనులే కావడం గమనార్హం. గ్రామంలో లభించే జీలుగు కల్లును ఎప్పటి మాదిరే వారు తాగారు. అయితే కాసేపటికే అది వికటించింది.
వెంటనే స్పందించిన స్థానికులు వారిని జడ్డంగిలోని ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఒకరు మృతి చెందారు. మిగిలిన వారి పరిస్థితి కూడా విషమించడంతో వారిని అడ్డతీగల పీహెచ్సీకి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.