Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అంబేద్కర్ వల్లే కేసీఆర్ సీఎం అయ్యారు: మంద కృష్ణ మాదిగ ఫైర్

అంబేద్కర్ వల్లే కేసీఆర్ సీఎం అయ్యారు: మంద కృష్ణ మాదిగ ఫైర్
రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
ఒక దళితుడు రాసిన రాజ్యాంగాన్ని కేసీఆర్ అనుసరించలేకపోతున్నారు
అంబేద్కర్ రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చింది

రాజ్యాంగాన్ని మార్చాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యలపై ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల 10 నుంచి అంబేద్కర్ విగ్రహాల వద్ద ఆందోళన కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. పాలకులు వారి వైఫల్యాలను రాజ్యాంగంపై ఆపాదించడం సరికాదని అన్నారు. నియంతృత్వ రాజ్యాంగాన్ని తీసుకురావడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

కేసీఆర్ కు దళితులపై గౌరవం లేదని మంద కృష్ణ అన్నారు. ఒక దళితుడు రాసిన రాజ్యాంగాన్ని ఇంకా ఎన్ని రోజులు అనుసరించాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉందని మండిపడ్డారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అవకాశం కలిగిందని… ఆ రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందని, కేసీఆర్ సీఎం అయ్యారని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ వల్లే తాను సీఎం అయ్యాననే విషయాన్ని కేసీఆర్ మర్చిపోయారని అన్నారు. కేసీఆర్ పాలనపై ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత వ్యక్తమవుతోందని… రాజ్యాంగం ప్రకారం తనపై నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రజలకు ఉందనే, రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ అన్నారని దుయ్యబట్టారు.

రాజ్యాంగాన్ని మార్చాలని అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి: బీఎస్పీ 

ఖమ్మం నగరంలో బుధవారం అంబేడ్కర్ సెంటర్ నందు భారత రాజ్యాంగాన్ని మార్చాలని అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు బుర్ర ఉపేందర్ సాహో ఆధ్వర్యంలో నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు . అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లోని ఆర్టికల్ మూడు ద్వారానే తెలంగాణ రాష్ట్ర సిద్ధించిందని , ఆయన అనుభవించే పదవులన్నీ అంబేద్కర్ పెట్టిన భిక్ష అని అన్నారు . భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కేసీఆర్ ఆ రాజ్యాంగాన్నే మార్చాలని అనుకోవడం అవివేకమని , మూర్ఖత్వమని , భారత ప్రజానీకానికి కేసీఆర్ క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు . జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మధుసూదన్ కు వినతిపత్రం సమర్పించారు .ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు చెరుకుపల్లి నాగేశ్వరరావు , ప్రధాన కార్యదర్శి పీసీ వీరస్వామి , జిల్లా కార్యదర్శులు బి ఉపేందర్ , కె.కృష్ణ , ఉదయ్ , మిర్యాల నాగరాజు , తదితరులు పాల్గొన్నారు .

ప్రజాసామ్యానికి ప్రమాదకారులు కేసీఆర్ , చినజీయర్:యాతాకుల భాస్కర్ మాదిగ

ఖమ్మం నగరంలో బుధవారం ఎస్సీ , ఎస్టీ , బీసీ జేఏసీ ఆఫీసులో ఎమ్ హెచ్ డీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు కొరిపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి అతిథిగా మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు యాతాకుల భాస్కర్ మాదిగ పాల్గొని మాట్లాడారు . తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు . చిన్న జీయర్ స్వామి డైరెక్షన్లో కేసీఆర్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారడం శోచనీయమని , డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అది వారు గుర్తు పెట్టుకోవాలన్నారు . దళితుల పట్ల వివక్ష తగదని , ఈ విధంగా ద్వంద వైఖరితో ఉంటే దళిత సమాజం బుద్ధి చెప్పక తప్పదని హెచ్చరించారు .

Related posts

సొంత సోదరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎంపీ కేశినేని నాని!

Drukpadam

కేసీఆర్ కుమార్తెను బీజేపీలోకి ఆహ్వానించడమా? పచ్చి అబద్దం …ఇది కేసీఆర్ చిల్లర రాజకీయాలకు పరాకాష్ట …డీకే అరుణ !

Drukpadam

ముర్ము విజయోత్సవ సభకు ఫుల్లుగా మందుకొట్టి వచ్చిన గుజరాత్ బీజేపీ నేత…!

Drukpadam

Leave a Comment