Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాజ్యాంగాన్ని కాదు.. కెసిఆర్ నే మార్చాలి: సీఎల్పీనేత భట్టి!

రాజ్యాంగాన్ని కాదు.. కెసిఆర్ నే మార్చాలి: సీఎల్పీనేత భట్టి
-సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క ఫైర్
-బిజెపి కుట్రలకు కెసిఆర్ వంత పాడుతుండు
-కేంద్రంతో కయ్యం కేసీఆర్ ది నాటకమే

రాజ్యాంగం మార్చలన్న బిజెపి కుట్రలకు సీఎం కేసీఆర్ వంత పాడటంపై తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజ్యాంగాన్ని మార్చాలని బిజెపి అంతర్లీనంగా చేస్తున్నా కుట్రలకు మద్దతు ఇచ్చే విధంగా సీఎం కేసీఆర్ కొత్త రాజ్యాంగం రాయాలని చేసిన వ్యాఖ్యలతో ఆయన వేసుకున్న ఫ్యూడల్ ముసుగు బయటపడిందని విమర్శించారు. భారత రాజ్యాంగం ద్వారా ఏర్పడిన తెలంగాణకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కొత్త రాజ్యాంగాన్ని కాదు.. ఈ రాష్ట్రానికి కొత్త సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
రాజ్యాంగం రద్దు చేయాలని బిజెపి ఎన్నో ఏళ్లుగా చేస్తున్న కుట్రలను ముందుకు తీసుకెళ్లే విధంగా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. మతతత్వ శక్తులు, ఫ్యూడల్ శక్తులు కలిసి భారత రాజ్యాంగాన్ని మార్చి భారత సమాజాన్ని మళ్లీ తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని అతి పెద్ద కుట్ర చేస్తున్నాయని అందుకు సిఎం వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని విమర్శించారు . సీఎం కేసీఆర్ మోడీ సర్కార్ పై చేస్తున్న తిట్ల పురాణం, ఆరోపణలు, విమర్శలు వట్టి బూటకమని, అంతర్లీనంగా బిజెపి ఎజెండాను అమలు చేయడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వంతో కెసిఆర్ కయ్యానికి కాలు దువ్వుతున్నట్టు తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టడానికి మాత్రమేనని, కెసిఆర్ ఆడుతున్న ఇది పెద్ద నాటకమని విమర్శించారు. దేశానికి అన్నీ ఇచ్చిన రాజ్యాంగాన్ని తెలంగాణలో ఏ ఒక్క రోజు అమలు పరచని సీఎం కేసీఆర్ కు కొత్త రాజ్యాంగం రాయాలని అనడానికి బుద్ధి ఉందా అని ప్రశ్నించారు. భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరు ఉండకపోవచ్చని, కానీ, తెలంగాణలో కేసీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా అనేకమార్లు తూట్లు పొడిచారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల చట్టం మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థలకు విలువ లేకుండా సీఎం కేసీఆర్ చేశారని మండిపడ్డారు. భారత రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థల పాలన పనితీరును బలహీనపరిచి భ్రష్టు పట్టించాడని ధ్వజ మెత్తారు. రాజ్యాంగాన్ని తెలంగాణలో తూ.చ తప్పకుండా అమలు చేస్తే అవినీతి పెరిగేది కాదని, సంపద అందరికీ పంచ బడేది అన్నారు. వీటికి సీఎం కేసీఆర్ అడ్డంకిగా మారడాని ఆరోపించారు. భారత రాజ్యాంగం లేకుంటే దేశంలో సామాన్యుడు బతికే పరిస్థితి లేదన్నారు. అందరికీ సమానత్వం, ఆత్మగౌరవం, మహిళలకు హక్కులను కల్పించిన రాజ్యాంగాన్ని భూస్వాములు, కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకోసం మార్చాలన్న బిజెపి మాటలను కేసీఆర్ మాట్లాడినట్లు ఉందన్నారు. దేశ సంపదను మోడీ కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతుంటే.. రాష్ట్ర సంపదను సీఎం కేసీఆర్ ఫ్యూడలిస్టు లకు దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. మత ఛాందసవాదులు, ఫ్యూడల్ శక్తులు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి ప్రజాస్వామిక వాదులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ న మార్చడానికి నడుం బిగించాలని కోరారు.

Related posts

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోసం దీదీ ప్రయత్నాలు!

Drukpadam

ఇకపై కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేస్తారని మేము అనుకోవడం లేదు: పెద్దిరెడ్డి!

Drukpadam

ఒకే వేదికపై పక్కపక్కనే కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి…

Drukpadam

Leave a Comment