Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

చర్చల ద్వారానే ఉద్యోగుల సమస్యలు పరిస్కారం …మంత్రులు బొత్స ,బాలినేని!

చర్చల ద్వారానే ఉద్యోగుల సమస్యలు పరిస్కారం …మంత్రులు బొత్స ,బాలినేని!
ఉద్యోగుల జీతాలు ప్రాసెస్ చేశాక ఆపాలనడం సరికాదు: మంత్రి బొత్స
ఉద్యోగుల విషయంలో సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారన్న మంత్రి బాలినేని
చిన్నచిన్న సమస్యలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోండి
తమది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వం
జగన్ సీఎం అయిన వెంటనే 27 శాతం ఐఆర్ ఇచ్చారు
మెరుగైన పీఆర్సీ కోసం ఉద్యోగుల పట్టు
పీఆర్సీ జీవోలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్
నేడు లక్షమందితో ఛలో విజయవాడ

పీఆర్సీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ,ఉద్యోగులకు మధ్య వైరం కొనసాగుతుంది. నేడు ఉద్యోగులు ఛలో విజయవాడకు ఇచ్చిన పిలుపు జయప్రదం అయింది . దీనిపై మంత్రులు బొత్స సత్యనారాయణ , బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఉద్యోగులు సమస్యలను చర్చలద్వారానే పరిష్కరించుకోవాలని మరోసారి పిలుపు నిచ్చారు. సీఎం జగన్ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు .

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు భారీగా ఛలో విజయవాడకు తరలివచ్చిన నేపథ్యంలో ఏపీ మంత్రులు ప్రభుత్వ వాణి వినిపిస్తున్నారు. తాజాగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. చర్చలకు మంత్రుల కమిటీ ఎప్పుడూ సిద్ధంగానే ఉందని, కానీ ఉద్యోగులు చర్చలకు రాకుండా ఆందోళనలు చేపట్టడం సరికాదని హితవు పలికారు. ఉద్యోగుల జీతాలను ఇప్పటికే ప్రాసెస్ చేశామని, ఈ దశలో జీతాలు ఆపాలని కోరడం సరికాదన్నారు.

పీఆర్సీ అమలులో ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఉద్యోగులు చర్చలకు వచ్చి ఉంటే సమస్యలు ఎప్పుడో పరిష్కారం అయ్యేవని బొత్స స్పష్టం చేశారు. ఇప్పటికైనా చర్చలకు అవకాశం ఉందని, ఉద్యోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఉద్యోగుల నిరసన ప్రదర్శనలపై ప్రభుత్వం, పోలీసులు సంయమనంతో వ్యవహరించినట్టు బొత్స తెలిపారు. అయితే తాము కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని చెప్పామని పేర్కొన్నారు.

కొత్త రాష్ట్రం అయినప్పటికీ తాము ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని చంద్రబాబు ప్రకటించడంపైనా బొత్స మండిపడ్డారు. ఉద్యోగులకు చంద్రబాబు ఉద్ధరించింది ఏంటంట? అని ప్రశ్నించారు. చంద్రబాబు కంటే మిన్నగా ఉద్యోగులకు లబ్ది చేకూర్చామని మంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా ఉన్నారని అన్నారు. చిన్నచిన్న సమస్యలను ఉద్యోగులు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. తమది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వమని చెప్పారు. జగన్ సీఎం అయిన వెంటనే 27 శాతం ఐఆర్ ఇచ్చారని, చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదని అన్నారు.

విద్యుత్ ఉద్యోగుల విషయంలో కూడా సీఎంతో మాట్లాడిన తర్వాత ఒకేసారి నాలుగు డీఏలు ఇచ్చామని చెప్పారు. విద్యుత్ శాఖలో పీఆర్సీపై మార్చిలో వేయాల్సిన కమిటీని ఇప్పుడే వేశామని అన్నారు. కరోనా వల్ల రాష్ట్రం ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులను ఉద్యోగులు గుర్తించాలని చెప్పారు.

ఇక మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలనే డిమాండ్ గురించి ఆయన మాట్లాడుతూ, పార్లమెంటు సెగ్మెంట్ ఆధారంగానే జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రాంతాల వారీగా జిల్లాల ఏర్పాటు జరిగే అవకాశం ఉంటే మొట్టమొదటగా మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Related posts

మమతా బెనర్జీపై కేంద్రం ఆగ్రహం… ప్రధాని మీకోసం వేచి చూడాలా అని మండిపాటు

Drukpadam

మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు…తీవ్రంగా పరిగణించిన బీజేపీ ఇద్దరిపై వేటు ….

Drukpadam

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ’వై ప్లస్​’ సెక్యూరిటీ!

Drukpadam

Leave a Comment