Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు వాహనం నిలిపింది పోలీస్ అధికారి

అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల విషయంలో కొత్త టిస్ట్
వాహనం నిలిపింది పోలీస్ అధికారి సచిన్ వాజే…
వెల్లడించిన ఎన్ఐఏ -సంచలనంగా మారిన కేసు
ఇటీవల అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల వాహనం
ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన ఎన్ఐఏ
పోలీసు అధికారి సచిన్ వాజే అరెస్ట్
సీసీటీవీ ఫుటేజి ఆధారంగా దర్యాప్తు
వాజే విచారణలో కీలక అంశాలు వెల్లడయ్యే అవకాశం
ప్రపంచ కుభేరుల్లో ఒకరు దేశంలో పారిశ్రామిక దిగ్గజంగా పేరొందిన ముకేశ్ అంబానీ ఇంటిముంచు పేలుడు పదార్థాల్లో ఉన్న వాహనం నిలిపింది ఒక పోలీస్ అని తేలడం తో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆయన ఎందుకు ఆలా చేశారు. దీని వెనక ఏదైనా కుట్ర ఉందా? పోలీస్ అధికారికి ఉగ్రవాదులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా ? సచిన్ వాజే తో పాటు ఇంకా ఎవరికైనా ఈ కుట్రతో సంబంధాలు ఉన్నాయా ? అనే కోణంలో నేషనల్ ఇన్వస్టిగేషన్ ఏజెన్సీ టీం దర్యాప్తు జరుపుతుంది.
రిలయన్స్ వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో కూడిన స్కార్పియో వాహనాన్ని నిలిపిందెవరో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వెల్లడించింది. పోలీసు అధికారి సచిన్ వాజే ఈ వాహనాన్ని అంబానీ ఇంటికి సమీపంలో నిలిపాడని తెలిపింది. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ఓ పెద్ద కర్చీఫ్ తో తన ముఖాన్ని కప్పుకున్నాడని, కుర్తా, పైజామా వేసుకున్నాడని ఎన్ఐఏ పేర్కొంది. సీసీటీవీ విజువల్స్ లో వాజే ధరించింది పీపీఈ కిట్ లా కనిపించిందని, కానీ ఆయన భారీ సైజు దుస్తులు ధరించాడని వివరించింది.
ఇక ఈ కేసులో వాజేను అరెస్ట్ చేసిన సందర్భంగా ఆయన నివాసం నుంచి ఓ లాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నామని, కానీ అందులో సమాచారాన్ని తొలగించినట్టు గుర్తించామని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. మొబైల్ ఫోన్ ను గురించి ప్రశ్నిస్తే అది ఎక్కడో పడిపోయిందని వాజే చెప్పాడని వివరించారు. పోలీసు అధికారి సచిన్ వాజేను విచారిస్తే అసలు విషయం వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Related posts

సరికొత్త చరిత్రకు సిద్ధమవుతున్న తెలుగమ్మాయి శిరీష.. నేడు రోదసీలోకి!

Drukpadam

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేనల్లుడి హఠాన్మరణం!

Drukpadam

అల్లకల్లోలంగా అరేబియా సముద్రం.. దేవభూమి ద్వారకలో ఆలయం మూసివేత!

Drukpadam

Leave a Comment