Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అండమాన్‌లో చేతులు కలిపిన టీడీపీ, కాంగ్రెస్…

అండమాన్‌లో చేతులు కలిపిన టీడీపీ, కాంగ్రెస్…
మునిసిపల్, పంచాయతీ ఎన్నికల్లో పొత్తు
పోర్టుబ్లెయిర్ మునిసిపాలిటీలోని 2, 5, 16 వార్డుల్లో టీడీపీ పోటీ
మిగతా బరిలోకి కాంగ్రెస్
6న పోలింగ్, 8న ఫలితాలు

అండమాన్ నికోబార్‌లో త్వరలో జరగనున్న మునిసిపల్, పంచాయతీ ఎన్నికల కోసం కాంగ్రెస్, టీడీపీ చేతులు కలిపాయి. ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఏఎన్‌టీసీసీ అధ్యక్షుడు రంగలాల్ హల్దార్, టీడీపీ స్థానిక అధ్యక్షుడు మాణిక్యరావు యాదవ్ బుధవారం పోర్టు బ్లెయిర్‌లో గాంధీ భవన్‌లో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. పొత్తులో భాగంగా పోర్టు బ్లెయిర్ మునిసిపాలిటీలోని 2, 5, 16 వార్డుల్లో టీడీపీ పోటీ చేస్తుంది. మార్చి 6న పోలింగ్ జరగనుండగా, 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి. సమావేశం అనంతరం రంగలాల్ హల్దార్ మాట్లాడుతూ.. పోర్టుబ్లెయిర్ అభివృద్ధి, ప్రజాస్వామ్యయుత పాలన కోసం టీడీపీతో కలిసి బరిలోకి దిగాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఎన్నికల్లో గెలుపుపై హల్దార్ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తెలంగాణ లో టీడీపీ ,కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విడివిడిగానే పోటీ చేశాయి. ఇక్కడ బీజేపీ తో దోస్తీ కోసం తెలుగుదేశం తాపత్రయపడుతుంది.

Related posts

తెలంగాణ‌కు ప‌నికొచ్చే ఒక్క మాట కూడా అమిత్ షా ప్ర‌సంగంలో లేదు: కేటీఆర్‌

Drukpadam

మంత్రి ఈటల భూకబ్జాలకు పాల్పడ్డారా ? ఉద్వాసన ఖాయమేనా!

Drukpadam

హుజూరాబాద్‌లోనే కాదు.. యూపీలోనూ బీజేపీకి ఓటమి తప్పదు: అసదుద్దీన్ ఒవైసీ…

Drukpadam

Leave a Comment