Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అక్షరాల పరిమితి లేకుండా కొత్త ఫీచర్ తీసుకువస్తున్న ట్విట్టర్!

అక్షరాల పరిమితి లేకుండా కొత్త ఫీచర్ తీసుకువస్తున్న ట్విట్టర్!

  • మొదట్లో ఓ ట్వీట్ కు 140 అక్షరాల పరిమితి
  • తర్వాత ఆ పరిమితిని 280 అక్షరాలకు పెంచిన వైనం
  • త్వరలో ఆర్టికల్స్ ఫీచర్
  • అక్షరాల పరిమితికి గుడ్ బై
  • వ్యాసాలు సైతం పోస్ట్ చేసే వెసులుబాటు

ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ ఆసక్తికర ఫీచర్ తీసుకువస్తోంది. ఈ ఫీచర్ సాయంతో ఎంత పెద్ద వ్యాసాన్నయినా ట్విట్టర్ లో పోస్టు చేయొచ్చు. ఇప్పటివరకు ఉన్న అక్షరాల పరిమితికి ఈ ఫీచర్ తో గుడ్ బై చెప్పేయొచ్చు.

మొదట్లో ట్విట్టర్ లో ఒక పోస్టుకు 140 అక్షరాల పరిమితి ఉండేది. 140 అక్షరాలు దాటితే ట్విట్టర్ లో పోస్టు చేయడం కుదరదు. ఆ తర్వాత కాలంలో ఆ పరిమితిని 280 అక్షరాలకు పెంచారు. అయినప్పటికీ ఏదైనా భారీ సమాచారం పోస్టు చేయాలంటే అనేక ట్వీట్లు చేయాల్సి వచ్చేది.

అయితే కొత్త ఫీచర్ సాయంతో ఆ బాధ తొలగిపోనుంది. ‘ఆర్టికల్స్’ పేరుతో ట్విట్టర్ త్వరలోనే కొత్త ఫీచర్ ను ప్రవేశపెడుతోంది. మెనూలో దీనికి సంబంధించిన ఆప్షన్ కనిపిస్తుంది. అక్షరాల పరిమితికి సంబంధించి ట్విట్టర్ పై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ‘ఆర్టికల్స్’ ఫీచర్ తో ట్విట్టర్ ఆ విమర్శలు తొలగించుకునే అవకాశం ఉంది.

Related posts

ఇవి మీకు తెలుసా ?

Drukpadam

పెసలపాడు ఎన్ కౌంటర్ బూటకం: మావోయిస్టు అగ్రనేత జగన్ లేఖ!

Drukpadam

జీతభత్యాలు,భద్రతలేని కొలువు విలేఖరిది… మంత్రి మల్లారెడ్డి

Drukpadam

Leave a Comment