Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అంబానీ నంబర్ 2.. అదానీ నంబర్ 1: ఫోర్బ్స్ తాజా లెక్కలు!

అంబానీ నంబర్ 2.. అదానీ నంబర్ 1: ఫోర్బ్స్ తాజా లెక్కలు!

  • ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా స్థానం
  • 90.01 బిలియన్ డాలర్ల నెట్ వర్త్
  • అంబానీ నెట్ వర్త్ 90 బిలియన్ డాలర్లు
  • ఏడాదిలో అదానీ సంపద గణనీయంగా వృద్ధి

అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని సంపద విషయంలో వెనక్కి నెట్టేశారు. దేశంలో, ఆసియాలో అత్యంత సంపన్నుడి స్థానాన్ని అదానీ సొంతం చేసుకున్నారు. గురువారం నాటికి గణాంకాల ఆధారంగా ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా విడుదల చేసింది.

90.01 బిలియన్ డాలర్ల నెట్ వర్త్ (సంపద విలువ/వారి పేరిట ఉన్న వాటాల విలువ)తో గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత సంపద పరుడిగా మొదటి స్థానంలో ఉన్నారు. ముకేశ్ అంబానీ 90 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. అదానీతో పోలిస్తే అంబానీ నెట్ వర్త్ 100 మిలియన్ డాలర్లు తక్కువగా ఉంది. ఏరోజుకారోజు కంపెనీల మార్కెట్ విలువ ఆధారంగా వీరి నెట్ వర్త్ మారిపోతుంటుందని తెలుసుకోవాలి.

2021 ఏప్రిల్ నాటికి అదానీ నెట్ వర్త్ 50.5 బిలియన్ డాలర్లుగానే ఉంది. అప్పుడు ఫోర్బ్స్ వార్షిక బిలియనీర్స్ జాబితాను విడుదల చేసింది. ఆ తర్వాత నుంచి అదానీ సంపద గణనీయంగా వృద్ధి చెందింది. కానీ, అదే కాలంలో అంబానీ నెట్ వర్త్ కేవలం 6.5 శాతమే (84.5 బిలియన్ డాలర్ల నుంచి ) పెరిగింది. అదానీ తొలిసారి 2008లో ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్స్ జాబితాలో చోటు సంపాదించారు. అప్పుడు ఆయన సంపద విలువ 9.3 బిలియన్ డాలర్లు. అప్పటి నుంచి 10 రెట్లు పెరిగింది.

Related posts

‘నలుపు’ వజ్రం.. వేలానికి రెడీ!

Drukpadam

వైయస్ జగన్ తిరుమల పర్యటన అడ్డుకుంటామన్న స్వామీజీలు !

Ram Narayana

ఢిల్లీ లిక్కర్ స్కాం తో తెలుగు రాష్ట్రాలకు సంబంధం ఉందా?

Drukpadam

Leave a Comment