Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఇందులో ఆధిపత్య ధోరణి ఉందా?: పవన్ వ్యాఖ్యలపై బదులిచ్చిన సజ్జల!

ఇందులో ఆధిపత్య ధోరణి ఉందా?: పవన్ వ్యాఖ్యలపై బదులిచ్చిన సజ్జల!

  • సజ్జల మీడియా సమావేశం
  • తాము ఎవరినీ అడ్డుకోవడంలేదన్న సజ్జల
  • దిక్కుమాలిన ఆలోచనలు తాము చేయబోమని వెల్లడి

ప్రభుత్వం ఆధిపత్య ధోరణి ప్రదర్శించిందని, దాంతో ఉద్యోగులకు అనుకున్నంత ఊరట లభించలేదని జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ మీడియా సమావేశం నిర్వహించగా, ఓ పత్రికా విలేకరి పవన్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. అందుకు సజ్జల బదులిస్తూ, ఇందులో ప్రభుత్వ ఆధిపత్య ధోరణి ఎక్కడుందని అన్నారు.

తాము ఆధిపత్య ధోరణి ప్రదర్శించి ఉంటే ఉద్యోగులు ఛలో విజయవాడ నిర్వహించి ఉండేవారా? అని ప్రశ్నించారు. ఎవరినీ అడ్డుకోవాలన్న దిక్కుమాలిన ఆలోచనలు తాము చేయబోమని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారో అర్థం కావడంలేదన్నారు. ఇందులో ఆధిపత్య ధోరణి లేదు… సంయమనం ఉంది, వినమ్రత ఉంది అని స్పష్టం చేశారు. ఇలాంటి సమస్యలు ఇంత త్వరగా పరిష్కారం పొందడం మరెక్కడా జరిగి ఉండదని అన్నారు.

దీంట్లో రాజకీయ లబ్ది పొందాలనుకుంటే పవన్ కల్యాణ్, ఆయన గురువు చంద్రబాబుకు సాధ్యం కాదని అన్నారు. సోషల్ మీడియా ఉంది కాబట్టి వాళ్లు ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేస్తుంటారని, ఆ వ్యాఖ్యల వల్ల ఇక్కడ ఎవరూ చెదిరిపోరు… ఈ ప్రక్రియ ఆగదు అని సజ్జల స్పష్టం చేశారు.

Related posts

కాంగ్రెస్ పార్టీ కమిటీకి కొండా సురేఖ షాక్ …

Drukpadam

టీకాల విషయంలో.. ముఖ్యమంత్రులకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లేఖలు…

Drukpadam

ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై అసెంబ్లీ లో జోగి రమేష్ ఫైర్…

Drukpadam

Leave a Comment