రెండవ రౌండ్ పల్లా కు తీన్మార్ మధ్య హోరాహోరీ
మూడవస్థానంలో ,కోందండరాం
తీవ్ర ఉత్కంఠత రేపుతున్న ఖమ్మం ,నల్లగొండ ,వరంగల్ పట్టభద్రుల కౌంటింగ్
-ఆధిక్యంలో పల్లా ,గట్టి పోటీనిస్తున్న తీన్మార్ మల్లన్న , కోదండరాం
-మొదటి ప్రాధన్యత గెలుపు అసాధ్యం
-నాలుగు ,ఐదు స్థానాలలో బీజేపీ ,కాంగ్రెస్
ఇప్పటి వరకు రెండు రౌండ్లు ఓట్ల లెక్కింపు పూర్తీ అయింది. రెండు రౌండ్లలో కలిపి టీఆర్ యస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి కి 31987 ఓట్లు రాగ , స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన తీన్మార్ మల్లన్నకు 24116 ఓట్లు వచ్చి అందరిని ఆశ్చర్య పరిచాడు .ఇక మూడవ స్థానంలో 18528 ఓట్లతో ప్రొఫెసర్ కోదండరాం కొనసాగుతున్నారు . బీజేపీ ప్రేమేందర్ రెడ్డి కి 13284 ఓట్లు , కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ కు 7589 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యతలో ఎవరు విజేత కాకపోతే రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు ,అందులో ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది. చివర నుంచి అభ్యర్థులను ఎలిమినేట్ చేసుకుంట వస్తారు. అందువల్ల ఎవరు గెలుస్తారనేది ఇప్పుడే చెప్పటం కష్టంగా ఉంటుంది. మొదటి ముగ్గురిలో ఎవరికైనా ఛాన్స్ ఉండే ఆవకాశం ఉంది. అయితే రెండవ ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా 50 శాతం ఓట్లు క్రాస్ కావాల్సి ఉంటుంది.
ఖమ్మం ,నల్లగొండ ,వరంగల్ పట్టభద్రుల కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠతను రేపుతున్నది . మొదటి ప్రాధాన్యతతోనే అధికార పార్టీ అభ్యర్థి గెలుస్తాడని అనుకుంటే అందుకు భిన్నంగా పట్టభద్రులు ఆలోచించినట్లుగా కౌంటింగ్ ను భట్టి తెలుస్తుంది.రెండవ రౌండ్ ఫలితాలలో కూడా పల్లా రాజేశ్వర రెడ్డికి ఆధిక్యం వచ్చినప్పటికీ ఇదే విధంగా వస్తే ఫలితం ఏవిధంగా ఉంటుందోనని ఆందోళన టీఆర్ యస్ శ్రేణుల్లో కనిపిస్తుంది. రెండవ రౌండ్లలో కలిపి పల్లా కు 31987 ఓట్లు రాగ , తీన్మార్ మల్లన్న కు 24116 ఓట్లు లభించాయి.ఇక ప్రొఫెసర్ కోదండరాం కు 18528 ఓట్లు లభించాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 13284కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ కు 7589 లభించాయు రాణి రుద్రమకు 1643 ,చెరుకు సుధాకర్ కు ,1330 ,లెఫ్ట్ అభ్యర్థి జయసారధిరెడ్డి కి 1263 ఓట్లు లభించాయి.ఇంకా ఐదు రౌండ్లు లెక్కించాల్సి ఉంది. వచ్చిన ఓట్లు కేవలం రెండవ రౌండ్ వి మాత్రమే .