Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నోటికొచ్చినట్టు వాగితే మూతి పగలగొడతా: టీడీపీ నేతపై రోజా ఆగ్రహం!

నోటికొచ్చినట్టు వాగితే మూతి పగలగొడతా: టీడీపీ నేతపై రోజా ఆగ్రహం!

  • నగరిలో రోజా వర్సెస్ గాలి భానుప్రకాశ్
  • రోజాపై ఆరోపణలు చేసిన భానుప్రకాశ్
  • ఇసుక, మట్టి అక్రమ రవాణాలో రోజాకు భాగం ఉందని ఆరోపణ
  • మండిపడిన రోజా

తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాశ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికొచ్చినట్టు వాగితే మూతి పగలగొడతా అంటూ వార్నింగ్ ఇచ్చారు.

నగరిలో గ్రావెల్, ఇసుక, మట్టి అక్రమ దందాలో రోజాకు కూడా భాగం ఉందంటూ గాలి భానుప్రకాశ్ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. తన తండ్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మట్టి అక్రమరవాణాను అడ్డుకుంటే, రోజా మాత్రం మట్టి తరలింపునకు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు.

దీనిపై రోజా తీవ్రస్థాయిలో స్పందించారు. తనపై కొందరు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను అక్రమంగా సంపాదిస్తున్నానని అంటున్నారని, కావాలంటే తన బ్యాంక్ బ్యాలెన్స్ ను వెల్లడి చేస్తానని స్పష్టం చేశారు. తాను ప్రజల పక్షాన నిలిచే నేతను అని, ప్రజల మధ్యలో ఉంటానని, అందుకే నగరిలో ఇల్లు కట్టుకున్నానని రోజా పేర్కొన్నారు. వైసీపీలో ఉన్న కొందరి సహకారంతో తనను ఓడించాలని భావిస్తే అది పగటి కలగానే మిగిలిపోతుందని రోజా వ్యాఖ్యానించారు.

Related posts

లాలూ రాంచి టు ఢిల్లీ :తిరిగి ఢిల్లీ టు రాంచి!

Drukpadam

వడ్లు కొనటంలేదని కేంద్రం ఎక్కడ చెప్పలేదు …పొంగులేటి సుధాకర్ రెడ్డి…

Drukpadam

ఒక రోజు ముందుగానే ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు!

Drukpadam

Leave a Comment