Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బిగ్ బాస్ హౌస్ పై నారాయణ కామెంట్ …కేసుపెడతానన్న నాగార్జున పెట్టుకోమన్న నారాయణ!

బ్రోతల్ హౌస్ అన్నందుకు హీరో నాగార్జున కేసు పెడతా అన్నాడు.. పెట్టుకో అని నేను అన్నాను: సీపీఐ నారాయణ

  • నాగార్జున అంటే నాకు ఇష్టమే
  • బిగ్ బాస్ తర్వాత ఆయనంటే అసహ్యం ఏర్పడింది
  • కేసీఆర్ నమ్మదగిన వ్యక్తి కాదు

ఏ విషయం గురించైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం సీపీఐ నేత నారాయణ నైజం. తన అభిప్రాయాలను ఏ మాత్రం మొహమాటం లేకుండా ఆయన వ్యక్తీకరిస్తుంటారు. బిగ్ బాస్ రియాల్టీ షోపై కూడా ఆయన గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ హౌస్ ను ఆయన బ్రోతల్ హౌస్ అంటూ గతంలో విమర్శించారు. దీనిపై తాజాగా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పందిస్తూ… నాగార్జున అంటే తనకు ఇష్టమేనని… అయితే బిగ్ బాస్ తర్వాత ఆయనంటే తనకు అసహ్యం ఏర్పడిందని అన్నారు.

బిగ్ బాస్ ప్రోగ్రాంలో నాగార్జున ముగ్గురు అమ్మాయిలను పిలిచి… ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తావు? ఏ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటావు? ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు? అని అడుగుతాడని… ఆడపిల్లలను పట్టుకుని ఎవరైనా ఇలా అడుగుతారా? అని నారాయణ మండిపడ్డారు. అందుకే ఆయనంటే తనకు అసహ్యం ఏర్పడిందని చెప్పారు. అందుకే బిగ్ బాస్ హౌస్ ను బ్రోతల్ హౌస్ అన్నానని తెలిపారు. బ్రోతల్ హౌస్ అన్నందుకు తనపై కేసు పెడతానని నాగార్జున అన్నాడని… పెట్టుకో అని తాను చెప్పానని అన్నారు.

ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. మోదీని వ్యతిరేకించినట్టు ఉంటూనే, మోదీకి నమ్మకమైన వ్యక్తిగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ నమ్మదగిన వ్యక్తి కాదని అన్నారు. కావాలనే బీజేపీని కెలుక్కునే ప్రయత్నం చేశారని చెప్పారు. గతంలో కూడా అనేక సార్లు కేసీఆర్ బీజేపీని వ్యతిరేకిస్తున్నట్లు చెబుతూనే కేంద్రానికి మద్దతు తెలిపిన విషయాన్నీ గుర్తు చేశారు . వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మొదట మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన కేసీఆర్ మంత్రులు ,ఎమ్మెల్యేలు ఎంపీ లచేత రాస్తా రోకో లు చేయించి ,ఢిల్లీకి వెళ్లి మద్దతు తెలుపుతానని చెప్పి వెనక్కు పీక్కున్నారని విమర్శనించారు . బీజేపీ చేసిన అనేక ప్రజావ్యతిరేక బిల్లులకు మద్దతు తెలిపి నేను బీజేపీకి వ్యతిరేకం అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

Related posts

కొత్త పీసీసీ సారధి రేవంత్ కు సీనియర్ల నుంచి చిక్కులే….

Drukpadam

పంతం నెగ్గించుకున్న కేరళ సర్కారు.. ఛాన్సలర్ పదవి నుంచి గవర్నర్ తొలగింపు!

Drukpadam

ఖమ్మం లో కాంగ్రెస్ కాంగ్రెస్ కు గుడ్ బై … 200 మంది తెరాసలో చేరిక…

Drukpadam

Leave a Comment