Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అచ్చంపేట‌లో తీవ్ర ఉద్రిక్త‌త‌.. కాంగ్రెస్‌, టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల ఘ‌ర్ష‌ణ‌

అచ్చంపేట‌లో తీవ్ర ఉద్రిక్త‌త‌.. కాంగ్రెస్‌, టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల ఘ‌ర్ష‌ణ‌
ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యం ముట్ట‌డికి వెళ్లిన కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు
అడ్డుకున్న టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు
కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడి

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో టీఆర్ యస్ ,కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో టీఆర్ యస్ కు చెందిన వారు కాంగ్రెస్ వారిపై దాడిచేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు . లేదు మా ఎమ్మెల్యే కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు వస్తుంటే తమ కార్యకర్తలు అడ్డుకున్నారని టీఆర్ యస్ ప్రత్యారోపణలు చేస్తుంది. తమపై దాడి చేసిన టీఆర్ యస్ కార్యకర్తలను వదిలి తమను అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ మండిపడుతుంది. పోలిసుల చర్య పక్షపాతంగా ఉందని ఆరోపిస్తుంది.

తెలంగాణలోని నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా అచ్చంపేట‌లో కాంగ్రెస్‌, టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చెల‌రేగి తీవ్ర ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. అచ్చంపేట ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత‌ గువ్వ‌ల బాల‌రాజు క్యాంపు కార్యాల‌యం ముట్ట‌డికి కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు బ‌య‌లుదేర‌గా వారిని టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్నారు.

దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య తోపులాట చోటు చేసుకుంది. రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడులు చేసుకున్నారు. కొంద‌రు కాంగ్రెస్‌ కార్య‌ర్త‌ల‌పై టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు భౌతిక దాడుల‌కు దిగారు. దీంతో ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను అదుపులోకి తీసుకుని వ్యానులో తీసుకెళ్లారు. టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌ను వ‌దిలేసి త‌మ కార్య‌క‌ర్త‌ల‌ను తీసుకెళ్లార‌ని కాంగ్రెస్ నేత‌లు మండిప‌డుతున్నారు.

Related posts

కాంగ్రెస్ కు ఓటు వేస్తే టీఆర్ఎస్ కు వేసినట్టే:బీజేపీ ఎమ్మెల్యే ఈటల…

Drukpadam

శివసేన పార్టీ పేరు, గుర్తు కోసం 2 వేల కోట్ల ఒప్పందమా …?

Drukpadam

మూడు రాజధానుల ఉద్యమానికి ప్రభుత్వమే స్పాన్సర్: సీపీఐ నారాయణ

Drukpadam

Leave a Comment