Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మోడీ బీజేపీ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారా ?

మోడీ బీజేపీ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారా ?
-ఏపీ విభజన బిల్లు సందర్భంగా అద్వానీ ,జోషి ,సుస్మా , అరుణజైట్లీ ఉన్నారు
-వారు అందరు ఈ బిల్లును సమర్థించారు
-పార్లమెంట్ లో తెలంగాణ విషయంలో ఆయన వ్యాఖ్యలు దేనికి సంకేతం
-ఏపీ విభజనపై ఇప్పుడెందుకు మాట్లాడుతున్నట్లు
-తెలంగాణ బీజేపీ కి ఇబ్బందిగా మరీనా మోడీ వ్యాఖ్యలు
-మోడీ వ్యాఖ్యలపై రాజకీయదుమారం

మోడీ బీజేపీ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారా ? … ఏపీ విభజన విషయంలో బీజేపీ తప్పు చేసిందా అంటే అవుననే సమాధానమే వస్తుంది. స్వయంగా ప్రధాని కాంగ్రెస్ నే కాదు బీజేపీ నిర్ణయాన్ని కూడా తప్పు పడుతున్నారని అని అంటున్నారు విశ్లేషకులు ….ఎందుకంటే ఏపీ విభజనలో కాంగ్రెస్ పాత్ర ఎంత ఉందొ అంటే పాత్ర బీజేపీది కూడా ఉంది. దీనిపై బీజేపీ నేత స్వస్మాస్వరాజ్ కూడా ఈ చిన్నమ్మను మరవద్దని కూడా తెలంగాణ ప్రజలను కోరారు .

తెలంగాణ ఏర్పాటు ఒక చారిత్రక సంఘటన …తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఒక్క సిపిఎం మినహా అన్ని పార్టీలు అంగీకరించాయి. ఏపీ ఎంపీలు అడ్డం పడ్డ పార్లమెంట్ లో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్చ లేకుండానే పార్లమెంట్ లో నెగ్గించింది. ఇందుకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీది కూడా ప్రముఖ పాత్రే … నాటి లోకసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న సుస్మాస్వరాజ్ క్రిడిట్ అంతా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి వెళ్ళుతుందేమోనని ఈ చిన్నమ్మను కూడా గుర్తు పెట్టుకోండని అన్నారు . అటు రాజ్యసభలో వెంకయ్య నాయుడు బిల్లును సమర్థిస్తూ , ఏపీకి ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను డిమాండ్ చేశారు .

కానీ నేడు అదే బీజేపీ నేత దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ విభజన తీరును తప్పు పడుతున్నారు . చర్చ లేకుండా బిల్లును ఆమోదించడం అప్రజాస్వామికమని అంటున్నారు . ఇందుకు కాంగ్రెస్ ను నిందిస్తున్నారు. బీజేపీ బిల్లు ను సమర్థించడమే కాకుండా బల్లలు చరిచి మరి మద్దతు పలికింది. అప్పడు లోకసభలో బీజేపీ అగ్రనేతలుగా ఉన్న అద్వానీ , మురళి మనోహర జోషి , సుస్మా స్వరాజ్ , అరుణ్ జైట్లీ లాంటి నేతలు ఉద్దండులు ఉన్నారు .వారు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నలకు బహుశా ప్రధాని మోడీ దగ్గర సమాదానాలు ఉండకపోవచ్చు …అయినా కాంగ్రెస్ ను నిందించడానికి తెలంగాణ అంశం లేవనెత్తడంపై తెలంగాణ బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించిన బీజేపీకి మోడీ వ్యాఖ్యలు ఇబ్బంది కరంగా మారాయని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి . 2023 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్న బీజేపీకి ప్రధాని మోడీ మాటలు మైనస్ గా మారాయి. దేశ వ్యాపితంగా రాజకీయ దుమారాన్ని లేపాయి. ప్రత్యేకించి తెలంగాణాలో బీజేపీ పై దండయాత్రికి మోడీ మంచి ఆయుధాన్ని అందించినట్లు అయింది.

ప్రధాని రాజ్యసభలో ఏపీ విభజనపై చేసిన వ్యాఖ్యలు సభను అగౌరవ పరిచేలా ఉన్నాయని టీఆర్ యస్ ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. ప్రధానిపై ప్రివిలేజ్ కమిటీ కి ఫిర్యాదు చేసేందుకు న్యాయ సలహాలు తీసుకుంటున్నామని ఆ పార్టీ పార్లమెంటరీ నేత కె .కేశవరావు పేర్కొన్నారు .

రాష్ట్ర వ్యాపితంగా టీఆర్ యస్ ప్రధాని మోడీ దిష్టి బొమ్మలను తగలబెట్టమని పిలుపునించింది. దీనిపై రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో నల్ల జెండాలతో ప్రదర్శనలు నిర్వహించారు. మోడీ శవ యాత్ర దిష్టి బొమ్మల దగ్ధం చేశారు . కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధాని మోడీ వ్యాఖ్యలను తప్పు పట్టింది. బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపు నిచ్చింది.

Related posts

తమిళనాట స్టాలిన్ క్యాబినెట్లో గాంధీ, నెహ్రూ!

Drukpadam

ప్రధాని మోడీ పర్యటన నిరసించండి …కూనంనేని

Drukpadam

తీరుమారని రాజకీయాలు …తిట్ల దండకాలతో కొనసాగిన పవన్ ప్రసంగం…

Drukpadam

Leave a Comment