Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఇంతవరకు ఇలా ఏ ప్రధాని మాట్లాడలేదు: మంత్రి కేటీఆర్

ఇంతవరకు ఇలా ఏ ప్రధాని మాట్లాడలేదు: మంత్రి కేటీఆర్

  • మోదీపై మరోసారి ధ్వజమెత్తిన కేటీఆర్
  • మోదీవి పనికిమాలిన మాటలని విమర్శలు
  • అసహ్యకరంగా మాట్లాడారని వ్యాఖ్య  
  • మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ పార్లమెంటులో అసహ్యకరంగా మాట్లాడారని విమర్శించారు. మోదీ మాట్లాడినవి పనికిమాలిన మాటలు అని అభివర్ణించారు. చట్టసభల్లో ఇలా మాట్లాడిన ప్రధానమంత్రి మరొకరు లేరని స్పష్టం చేశారు. ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సిన ప్రధాని విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గుజరాత్ కంటే తెలంగాణ ముందంజలో ఉందని ప్రధానికి కడుపుమంట అని ఆరోపించారు.

ఏపీ, తెలంగాణను మళ్లీ కలిపేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది: మంత్రి తలసాని

  • రాష్ట్ర విభజనపై మోదీ వ్యాఖ్యలు
  • భగ్గుమంటున్న టీఆర్ఎస్ నేతలు
  • నేడు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు
  • మోదీ క్షమాపణలు చెప్పాల్సిందేనన్న తలసాని
Talasani alleges that BJP hatches a conspiracy to reunite AP and Telangana

ఇటీవల బడ్జెట్ ప్రకటన అనంతరం తెలంగాణ అధికార పక్షం టీఆర్ఎస్ కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం ముదిరింది. కొన్నిరోజుల కిందట ప్రధాని మోదీ ఉమ్మడి రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలతో టీఆర్ఎస్ నేతలు రగిలిపోతున్నారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.

ఏపీ, తెలంగాణను మళ్లీ కలిపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. గుజరాత్ కంటే తెలంగాణ ఎక్కువ అభివృద్ధి చెందుతుండడం పట్ల ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. తన వ్యాఖ్యల పట్ల తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. ప్రధాని క్షమాపణలు చెప్పేవరకు బీజేపీ నేతలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

Related posts

పనిచేసే మంత్రి ఉన్నాడంటే అది ఈటల ఒక్కడే: ఎంపీ అరవింద్

Drukpadam

ఢిల్లీలో మౌన దీక్ష‌కు దిగిన కేఏ పాల్‌!

Drukpadam

వైసీపీని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి: బాలకృష్ణ

Drukpadam

Leave a Comment