Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మోడీ జాగ్రత్త …తెలంగాణ పులి బిడ్డను ఢిల్లీ కోటను బద్దలు కొడతా :జనగామ సభలో కేసీఆర్

మోడీ జాగ్రత్త …తెలంగాణ పులి బిడ్డను ఢిల్లీ కోటను బద్దలు కొడతా :జనగామ సభలో కేసీఆర్
-పిడికెడు లేని బీజేపీ వాళ్ళు టీఆర్ యస్ జోలికొస్తే నశం అవుతారు
-ఉడత బెదిరింపులకు భయపడం
-సహాయం చేయరు చేసుకుంటే ఊరుకోరు
-రైతులకు అన్యాయం చేసిన ఘనత మోడిదే
-దేశానికి లక్షల కోట్లు మోసం చేసిన వాళ్ళను టికెట్స్ ఇచ్చి లండన్ పంపారు
-ఇక్కడ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు

దేశం కోసం కొట్లాడదాం…ఢిల్లీ కోటను బద్దలు కొడదాం … జాగ్రత్త మోడీ తెలంగాణ పులిబిడ్డ వస్తుంది కాచుకో …మా ప్రజలకు అన్యాయం చేస్తే సహించాలనా? ఊర్కోవలనా ? మా బతుకులు కూడా మమ్మలను మీరు బ్రతకనివ్వరా ? ఇదెక్కడి న్యాయం మా ప్రజలు శాంతా మూర్తులు ,కానీ అవసరం వస్తే ఏమి చేస్తారో తెలంగాణ రాష్ట్ర సాధనలో చూపించారు . గతంలో సిద్ధిపేట ప్రజలు పంపిస్తే రాష్ట్ర సాధించా? ఇప్పుడు మీరందరు ఢిల్లీపై యుద్దానికి పొమ్మంటే సిద్ధం అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీ పాలనపై తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు .అందుకు ప్రజల మద్దతు కోరారు . ప్రజల నుంచి హర్హతిరేకలు వ్యక్తం అయ్యాయి.ఇక్కడ పిడికెడు లేని బీజేపీ వాళ్ళు టీఆర్ యస్ కార్యకర్తలపై దాడులు చేస్తారా ? జాగ్రత్త బిడ్డ …మేము సహనంగా ఉన్నాం …మావాళ్లు తలుచుకుంటే నశం ,నశం అవుతారు అంటే బీజేపీకి ఘాటైన హెచ్చరికలు చేశారు . మీ ఉడత బెదిరింపులకు భయపడం పరిధి దాటితే భరతం పడతాం ఏమనుకుంటున్నారు అని ఆగ్రహం ప్రకటించారు .

రాష్ట్రానికి కావాల్సినవి చేయరు …అడిగితె అపహాస్యంగా మాట్లాడతారు …. ఇది సమాఖ్య రాజ్యం …దేహి అని అడుక్కోవాల్సిన పనిలేదు …బాజాప్తాగా రాష్ట్రాలకు రావలసిన వాటాలు ఇవ్వాలి … తెలంగాణ ప్రాజక్టులకు జాతీయహోదా ఇవ్వరు .ఖాజిపేట్ కూ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లేదు … రైతుల ధాన్యం కొనరు .కరెంటు మీటర్లు పెట్టాలని అంటారు … రాష్ట్రాలపై పెత్తనం చేయడానికి సై అంటారు…. రాష్ట్రాలను ఆదుకోమని అడిగితె నహి అంటారు …ఇదేనా కేంద్ర రాష్ట్ర సంబంధాలు అని ప్రశ్నించారు . రైతులకు అన్యాయం చేసే కరెంటు మీటర్లను నన్ను చంపినా పెట్టానని , ఏమి చేసుకుంటారో చేసుకోండని కుండబద్దలు కొట్టానని కేసీఆర్ పేర్కొన్నారు.గతంలో చంద్రబాబు కరెంట్ మీటర్లు పెట్టాలని అంటే ఆయన మీటర్ ఊడగొట్టిన విషయాన్నీ గుర్తు చేశారు .

డీజిల్ ధరలు పెంచారు . గ్యాస్ ధరలు పెంచారు . ఎరువు ల ధరలు పెంచారు …ప్రజలు ధరల పెరుగుదలతో అల్లాడుతుంటే కేంద్రం ఏమి చేస్తుందని అన్నారు .తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టాం …సంక్షేమం పథకాలు ప్రజలకు అందిస్తున్నాం …గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి జరగాలి. లక్షలు కోట్లు ముంచిన వాళ్ళను టికెట్స్ కొని ఇచ్చి లండన్ కు పంపి , ఇక్కడ ప్రజలను ఇబ్బందులు పెట్టటం న్యాయమా ? అని ప్రశ్నించారు . మీ సంస్కరణలు ప్రజలకు మేలు చేసేవి కావు అందువల్ల వాటిని అమలు జరపం అని ఏమి చేసుకుంటారో చేసుకోండని అన్నారు .

దేశంలో అనేక రాష్ట్రాల కంటే ముందు వరసలో ఉన్నాం …దేశం గురించి కొట్లాడదామా ?జాతీయ రాజకీయాల్లో పాత్ర వహించుదామా ? మన మాట వినే వాడిని ఢిల్లీ పీఠం మీద కూర్చోబెడదామా ? అంటూ మీరు దీవిస్తే ఢిల్లీ కోటా బద్దలు కొడతా అక్కడే కూర్చుంటా అని అన్నారు . జనగామ కూ మెడికల్ కాలేజీ వస్తుందని ,కేంద్రం ఇవ్వకపోయినా ప్రజల సంక్షేమ పథకాలు ఆగవని ఉద్ఘాటించారు …ఈ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరైయ్యారు . కరోనా తరువాత కేసీఆర్ పాల్గొన్న పెద్ద సభ ఇదే కావడం విశేషం ….

Related posts

ఒవైసీల మెప్పు పొందడానికి కేసీఆర్ యత్నిస్తున్నారు: మాజీ సీఎం రమణ్ సింగ్!

Drukpadam

కిర‌ణ్ కుమార్ రెడ్డి సేవ‌లు కాంగ్రెస్‌కు అవ‌స‌రం: ఏఐసీసీ సెక్ర‌ట‌రీ మ‌య్య‌ప్ప‌న్‌!

Drukpadam

కేసీఆర్ భ‌విష్య‌త్తు రాజ‌కీయలపై గ‌వ‌ర్న‌ర్‌ త‌మిళిసై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Drukpadam

Leave a Comment