Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జనగామ సభ తర్వాత కేసీఆర్ ఖేల్ ఖతమనిపించింది …పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

జనగామ ప్రసంగం తర్వాత సీఎం కేసీఆర్ ఖేల్ ఖతమ్ అన్న సంగతి స్పష్టమైంది: రేవంత్ రెడ్డి

  • మోదీ ‘రాష్ట్ర విభజన వ్యాఖ్యల’ ప్రస్తావన చేయని కేసీఆర్ 
  • మండిపడిన రేవంత్ రెడ్డి
  • మోదీ అంటే అంత భయమెందుకని వ్యాఖ్యలు

జనగామ సభలో కేసీఆర్ ప్రధాని మోడీ తెలంగాణ ఏర్పాటు పై చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇస్తారని భావిస్తే అందుకు విరుద్ధంగా అసందర్భ ప్రేలాపనలతో ప్రజలకు మాయమాటలు చెప్పే ప్రయత్నం చేశారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు .

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ జనగామలో కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. అయితే తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించిన ప్రధాని మోదీపై ఎందుకు విరుచుకుపడలేదని సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మోదీని నిలదీయడానికి కేసీఆర్ కు అంత భయమెందుకు? అని ప్రశ్నించారు. జనగామలో ప్రసంగం విన్న తర్వాత కేసీఆర్ ఖేల్ ఖతమ్ అన్న సంగతి స్పష్టమైందని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

తెలంగాణను అమరవీరుల త్యాగాలతో సాధించుకున్నారని, అలాంటి తెలంగాణను ఎవరైనా అవమానిస్తుంటే అసలు సిసలైన తెలంగాణ బిడ్డ ఎవరైనా పౌరుషం ప్రదర్శిస్తారని, కానీ కేసీఆర్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారని విమర్శించారు. ఇవాళ జనగామలో సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వాన్ని, మోదీని, బీజేపీని విమర్శించినా… మోదీ చేసిన రాష్ట్ర విభజన వ్యాఖ్యల ప్రస్తావన మాత్రం తీసుకురాలేదు.

Related posts

మునుగోడులో గెలవబోతున్నాం: కేటీఆర్

Drukpadam

ఆలులేదు …సూలులేదు సీఎం సీటు కోసం కాంగ్రెస్ లో కొట్లాట …

Drukpadam

హైద్రాబాద్ లో రాహుల్ పర్యటన కాక!

Drukpadam

Leave a Comment