Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వైయస్ షర్మిల అరెస్ట్ …పోలీస్ స్టేషన్ కు తరలింపు …

వైయస్ షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పీఎస్ లో కూడా ధర్నాకు దిగిన వైనం!

  • ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ షర్మిల ధర్నా
  • కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్
  • అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించిన పోలీసులు

తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు, జాబ్ నోటిఫికేషన్ గురించి వైయస్సార్టీపీ అధ్యక్షురాలు తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈరోజు హైదరాబాదులోని టీఎస్పీఎస్సీ కార్యాలయం ఎదుట ఆమె ధర్నాకు దిగారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగభృతిని అమలు చేయాలంటూ టీఎస్పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్దన్ రెడ్డికి వినతిపత్రాన్ని అందించారు. అనంతరం ధర్నాకు దిగారు. ఉద్యోగాలు ఇవ్వని ఈ సీఎం మనకు వద్దని నినాదాలు చేశారు. కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ లో కూడా ఆమె ధర్నాకు దిగారు.

Related posts

కర్ణాటక సీఎల్పీ సమావేశం… సీఎం ఎంపికపై ఎమ్మెల్యేలతో సమాలోచనలు …

Drukpadam

షబ్బీర్ అలీ టార్గెట్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో బాంబ్ ….

Drukpadam

అంకెల హంగామా, అభూత కల్పనలు : ఏపీ బడ్జెట్ పై నాదెండ్ల మనోహర్…

Drukpadam

Leave a Comment