Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీకి ప్రత్యేక హోదా అంశం తొలగింపుకు జీవీఎల్ నే కారణం …ఎంపీ భరత్

హోదా అంశం తొల‌గింపున‌కు బీజేపీ ఎంపీ జీవీఎల్ కార‌ణం: వైసీపీ ఎంపీ మార్గాని భ‌ర‌త్‌ ఆరోపణ

  • ఏపీ అభివృద్ధిని జీవీఎల్ అడ్డుకుంటున్నారు
  • అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చాలి
  • ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేసీఆర్ కూడా చెప్పారన్న భరత్ 

ఏపీ కి ప్రత్యేక హోదా అంశం రెండు తెలుగు రాష్ట్రాల తో జరిపే చర్చల ఎజెండాలో ఉంది . విభజన హామీలను గురించి చర్చించేందుకు కేంద్రం తెలుగు రాష్ట్రాల అధికారులతో ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఎజెండాలో ఉన్న ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం అకస్మాత్తుగా తొలగించింది. దీంతో ఖంగు తిన్న వైసీపీ ఇది ఎలా జరిగిందని ఆరా తీసింది. అయితే ప్రత్యేక హోదా అంశం తొలగించడానికి బీజేపీ కి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కారణమని వైసీపీ ఆరోపిస్తున్నది . ప్రధాని మోడీ ,హోమ్ మంత్రి అమిత్ షా ఆమోదంతో రూపొందిన ఎజండాను తొలగించడం సాధ్యమయ్యే పనేనా అంటూ జీవీఎల్ కౌంటర్ ఇచ్చారు . అయినప్పటికీ ముందు నుంచి ఎజండా సమాశంపై ఉత్సాహం చూపుతున్న జీవీఎల్ కేంద్రంపై వత్తిడి తెచ్చి ఎజండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగింపా జేశారని ఇది ముమ్మాటికీ జీవీఎల్ కుట్రేనని వైసీపీ ఆరోపణలు గుప్పిస్తుంది.

కేంద్ర హోంశాఖ అజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించడానికి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావే కారణమని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. తెలుగు వ్యక్తి అయి ఉండి ఏపీ అభివృద్ధిని ఆయన అడ్డుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర హోంశాఖ త్రిసభ్య కమిటీ అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు.

ఏపీకి జరుగుతున్న అన్యాయంపై వైసీపీ ఎంపీలందరం అనేకసార్లు మాట్లాడామని… విభజన హామీలు, హోదాను సాధించేందుకు తాము కృషి చేస్తున్నామని భరత్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ. 2,100 కోట్లు రీయింబర్స్ చేయాల్సి ఉందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పారని తెలిపారు. ఇదే సమయంలో ఏపీలో కొత్త జాతీయ రహదార్లను నిర్మిస్తున్న కేంద్రానికి మార్గాని కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

విండో సీటు కోసం ఆ చిన్నారి పట్టుబట్టడమే తండ్రీబిడ్డల ప్రాణాలు కాపాడింది!

Drukpadam

ఢిల్లీలో ముగిసిన అఖిలపక్ష సమావేశం… వివరాలు తెలిపిన వైసీపీ, టీడీపీ ఎంపీలు

Drukpadam

చంద్రబాబు దీక్షలో జగన్ పై అగ్గిమీద గుగ్గిలం …

Drukpadam

Leave a Comment