ఎట్టకేలకు అసోం సీఎం హిమంతపై హైదరాబాద్‌లో కేసు నమోదు…
- కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యల కేసు
- ఐపీసీ 504, 505 క్లాజ్ 2 సెక్షన్ల కింద కేసు నమోదు
- ప్రతి పోలీసు స్టేషన్‌లో జీడీ ఎంట్రీ
- వాటిని జూబ్లీహిల్స్ పీఎస్‌కు బదిలీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై కాంగ్రెస్ నేతలు తెలంగాణలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. అసోం సీఎంపై ఐపీసీ 504, 505 క్లాజ్ 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, ఉద్దేశపూర్వకంగానే రాహుల్ గాంధీని అవమానించారనే ఆరోపణల కింద కేసులను చేర్చామని పోలీసులు చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు బదిలీ అవుతాయని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రతి పోలీసు స్టేషన్‌లో జీడీ ఎంట్రీ చేసుకున్నారని, వాటిని జూబ్లీహిల్స్ పీఎస్‌కు బదిలీ చేస్తారని చెప్పారు. నిబంధనల ప్రకారం ఒకే విషయంపై అనేక ప్రాంతాల్లో వచ్చిన ఫిర్యాదులపై ఒకే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.