Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

గౌతమ్ సవాంగ్ కు జగన్ సర్కార్ సముచిత గౌరవం …

గౌతమ్ సవాంగ్ కు జగన్ సర్కార్ సముచిత గౌరవం …
-ఏపీపీఎస్సీ చైర్మన్‌గా తాజా మాజీ డీజీపీ గౌతం స‌వాంగ్‌ను నియ‌మించిన ప్ర‌భుత్వం
-నోరెళ్ళ బెట్టిన విమర్శకులు
-గవర్నర్ కు ఏపీ స‌ర్కారు ప్ర‌తిపాద‌నలు
-ఇటీవ‌లే స‌వాంగ్ బ‌దిలీ
-ఆరు నెలలుగా ఏపీపీఎస్సీ చైర్మన్ ప‌ద‌వి ఖాళీ

ఏపీ డీజీపీ పదవి నుంచి గౌతం సవాంగ్ ను బదిలీ చేసిన ప్ర‌భుత్వం ఆయ‌న స్థానంలో ఇంటెలిజెన్స్‌ విభాగం డీజీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డిని నియమించిన విష‌యం తెలిసిందే. గౌతమ్‌ సవాంగ్‌ను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్‌ చేయాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఆయ‌న‌ను ఏపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించి సముచితంగా గౌరవం ఇచ్చింది. దీంతో ఆయనపై ప్రేమ కురిపించిన ప్రతిపక్షాలు , విమర్శకులు నోరెళ్ళ బెట్టారు . ఆయన్ను అనవసరంగా తొలగించారని , ఆయనకు అన్యాయం జరిగిందని , అయ్యే పాపం అన్న అని ఆప్యాయంగా పిలిచిన జగన్ ఆయనపై విషం చిమ్మారని నానా రకాల మాటలు అన్నారు . ఇప్పటివరకు వాడుకొని వదిలేశారని విమర్శలు చేశారు . గౌతమ్ సవాంగ్ పై సానుభూతు వెల్లువెత్తింది. చివరకు నర్సాపురం ఎంపీ రఘురామ,వర్ల రామయ్య , పవన్ కళ్యాణ్ లాంటి నేతలంతా గౌతమ్ సవాంగ్ కు మద్దతుగా మాట్లాడారు . సవాంగ్ ను కేవలం పీఆర్సీ పై ఉద్యోగసంఘాల చలో విజయవాడ కు ఇచ్చిన కార్యక్రమాన్ని అడ్డుకోలేదని అందువల్లనే ఆయన్ను బదిలీ చేశారని ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వం సడన్ గా సవాంగ్ ను ఏపీ పీఎస్సీకి చైర్మన్ గా నియమించడంతో నోరెళ్లెబెట్టారు . దీంతో పరిశీలకులు దటీస్ జగన్ మార్క్ రాజకీయాలు అంటున్నారు .

ఈ మేరకు ప్ర‌భుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వ‌చ్చింది. ఉదయం ఇందుకు సంబంధించి ప్రతిపాదనలను గవర్నర్‌ భిశ్వభూషణ్ హరిచందన్‌కు ప్రభుత్వం పంపింది. గవర్నర్‌ ఆమోదం పొందిన తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. కాగా, ఏపీపీఎస్సీ చైర్మన్‌‌గా ఉన్న ఉదయ్‌భాస్కర్ పదవీ కాలం ఆరు నెలల క్రితం ముగిసిన‌ప్ప‌టికీ, ఇప్ప‌టికీ ఆ పోస్ట్ ఖాళీగానే ఉంది.

Related posts

భాస్కర్ రెడ్డి పారిపోయే అవకాశం ఉందని అరెస్ట్ చేశాం: సీబీఐ

Drukpadam

పట్టభద్రులలో పట్టు ఎవరిదో…

Drukpadam

భారత రాష్ట్రపతులు జులై 25నే ప్రమాణ స్వీకారం ఎందుకు చేస్తారంటే..!

Drukpadam

Leave a Comment