కారణజన్ముడు సీఎం కేసీఆర్ : ఎంపీ నామ నాగేశ్వరరావు…
–కేసీఆర్ పాలనతో దేశానికి సరికొత్త దిశానిర్దేశం
–కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ
–రైతు బందు ,ఉచిత విద్యత్ అమలు చేస్తున్నఏకైక రాష్ట్ర తెలంగాణ
–ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే టాప్
–ప్రపంచవ్యాపితంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
తెలంగాణ రాష్ట్ర కల సాకారం చేసిన కారణజన్ముడు కేసీఆర్ అని ఆయన మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని లోకసభలో టీఆర్ యస్ పక్ష నేత ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆకాంక్షించారు . కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నేడు అనేకమంది ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు . ప్రపంచ వ్యాపితంగా తెలుగుప్రజలు వివిధ దేశాలలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం విశేషమని నామా కొనియాడారు . ఆయన సారథ్యంలో రాష్ట్రం ప్రగతి పధంలో దూసుకుపోతోందని గణాంకాలతోసహా నామా వివరించారు .
ఆరు దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసిన ఘటన కేసీఆర్ దేనని అన్నారు . దేశంలోనే మరే రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలుచేసి యావత్ దేశం తెలంగాణ వైపు చేసే విధంగా చేసారని కొనియాడారు . దేశానికి అభివృద్ధిలో సరికొత్తగా దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్ర కెక్కడని నామా తన ప్రకటనలో పేర్కొన్నారు . ఏడేళ్ల స్వల్పకాలంలో కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణలో వ్యవసాయ రంగం కొత్త రంగు పులుముకున్నదని అన్నారు . అధికారంలోకి వచ్చిన వెంటనే సాగునీటి ప్రాజెక్టులకు ఏటా రూ .25 వేల కోట్లు ప్రకటించారని , రూ . లక్షన్నర కోట్లు కేటాయించి రూ .83 వేల కోట్లతో కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణం పూర్తి చేశారని ఎంపీ నామ పేర్కొన్నారు . రైతాంగానికి ఏటా రూ .10,500 కోట్లతో రాష్ట్రంలో 26 లక్షలకు పైగా పంపుసెట్లకు వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు . వ్యవసాయ రంగ సంబంధిత విద్యుత్ మౌలిక సదుపాయాల కోసం రూ .28,473 కోట్లు ఖర్చుచేసిన ఏకైక రాష్ట్రం మనదేనన్నారు . రైతుబంధు పథకం ద్వారా ఎనిమిది విడతలలో సుమారు 65 లక్షల మంది రైతుల ఖాతాలలో ఎకరానికి ఏడాదికి రూ .10 వేల చొప్పున రూ .50,446 , 16 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు . 40 లక్షల మంది రైతులకు ఏడేళ్లలో సుమారు రూ .17 వేల కోట్ల రుణమాఫీ చేశారని అన్నారు . రైతు భీమా పథకం ద్వారా 70,714 రైతు కుటుంబాలకు రూ .5 లక్షల చొప్పున రూ . 3535.70 కోట్లు పరిహారం అందేలా చేశారు . రైతుబంధు , రైతుభీమా వంటి పథకాలు అమలవుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయే నని ఎంపీ నామ అన్నారు . ధాన్యం ఉత్పత్తిలో , సేకరణలో దేశంలో నంబరు 2 గా తెలంగాణ నిలిచిందని ఎంపీ నామ గుర్తుచేశారు . ఏడేళ్లలో ధాన్యం కొనుగోలుకు రూ . 84,106 కోట్లు వెచ్చించారనీ , దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు వ్యవసాయ విజ్ఞానం కోసం రూ .573 కోట్లతో రాష్ట్రంలో 2601 రైతువేదికల నిర్మాణం పూర్తిచేశారని తెలిపారు . తెలంగాణ ప్రభుత్వ సాగు అనుకూల విధానాల మూలంగా 2014 నాటికి కోటి 31 లక్షల ఎకరాలలో ఉన్న పంటలసాగు 2021 నాటికి రెండు కోట్ల మూడు లక్షల ఎకరాల విస్తీర్ణానికి పెరిగిందని తెలిపారు . తెలంగాణ వ్యవసాయ వృద్ధి రేటు 15.8 శాతం కాగా జాతీయ వృద్ధి రేటు 8.5 శాతం కన్నా ఎక్కువ కావడం సీఎం కేసీఆర్ పాలనకు నిదర్శనమన్నారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు 45 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చే వరి ధాన్యం నేడు మూడు కోట్ల టన్నులకు పెరగడం తెలంగాణ సాధించిన విజయమని ఎంపీ నామ పేర్కొన్నారు . నేడు సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను రాష్ట్రంతో పాటు వివిధ దేశాల్లో ఉన్న సీఎం కేసీఆర్ అభిమానులు , టీఆర్ఎస్ శ్రేణులు పండుగలా కేసీఆర్ బర్త్ డే వేడుకలను జరుపుకుంటున్నారని అన్నారు . ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఎంపీ నామ ఆకాంక్షించారు .