Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

కోవిడ్ అడుగు పెట్టని దేశాలు ఇవి..!

కోవిడ్ అడుగు పెట్టని దేశాలు ఇవి..!

  • జనాభా చాలా తక్కువ
  • పసిఫిక్, అట్లాంటిక్ తీర ద్వీప దేశాలు
  •  జాబితాలో తువాలు, టోకెలు, సెయింట్ హెలెనా
  • ప్రంపచ ఆరోగ్య సంస్థ వెల్లడి

రెండేళ్ల నుంచి ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వేధిస్తోంది. ఎన్నో దేశాలు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నాయి. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ, కరోనా తాకని దేశాలు ఇప్పటికీ కొన్ని ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) జాబితాను పరిశీలిస్తే ఈ వివరాలు తెలుస్తాయి.

ఈ దేశాలన్నీ కూడా చిన్న చిన్న ద్వీపాలే. పసిఫిక్, అట్లాంటిక్ తీర ప్రాంతాలు. జనాభా వేల నుంచి లక్షల్లోనే ఉంటుంది. సుముద్ర తీరాన్ని కలిగి ఉండడం, చిన్న దేశాలు కావడంతో కరోనా ప్రపంచానికి దూరంగా భద్రంగా ఉండగలిగాయని చెప్పుకోవచ్చు. డబ్ల్యూహెచ్ వో జాబితాలో కరోనా రహిత దేశాలు కొద్ది కాలం క్రితం పదుల సంఖ్యలో ఉన్నాయి. కానీ, పలు కారణాలతో సరిహద్దులను తెరవడంతో అవి ఒక్కొక్కటిగా కరోనా బారిన పడుతున్నాయి.

తువాలు, టోకెలు, సెయింట్ హెలెనా, పిట్ కెయిర్న్ ఐల్యాండ్స్, నియూ, నౌరు, మైక్రోనేషియా, తుర్క్ మెనిస్థాన్, ఉత్తర కొరియా కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా రహిత దేశాల జాబితాలో ఉన్నాయి. ఉత్తర కొరియాలో ఏం జరిగిందో బాహ్య ప్రపంచానికి తెలియదు. డబ్ల్యూహెచ్ వో జాబితాలోని కొన్ని దేశాలు కరోనా కేసుల సంఖ్యను అధికారికంగా ప్రకటించి ఉండకపోవచ్చు కూడా.

Related posts

పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు తక్షణమే రద్దు చేయాలి: జనసేన

Drukpadam

హ‌రీశ్ రావుతో క‌లిసి గాంధీ ఆసుప‌త్రిలో క‌రోనా రోగుల‌ను ప‌రామ‌ర్శించిన సీఎం కేసీఆర్..

Drukpadam

థర్డ్ వేవ్ భయాలు… అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని పొడిగించిన భారత్!

Drukpadam

Leave a Comment