Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి తండ్రి విగ్రహ ఏర్పాటుపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం!

తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి తండ్రి విగ్రహ ఏర్పాటుపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం!

  • తాడిపత్రిలో విగ్రహ ఏర్పాటుపై వివాదం
  • ఆయనేమైనా స్వాతంత్ర్య సమరయోధుడా? అంటూ జేసీ మండిపాటు
  • రహదారిపై విగ్రహం ఏంటని ప్రశ్నించిన వైనం

తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి విగ్రహం ఏర్పాటుపై టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రహదారిపై విగ్రహ ఏర్పాటుకు ఆయనేమన్నా స్వాతంత్ర్య సమరయోధుడా? అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. దీనిపై కలెక్టర్ నాగలక్ష్మికి 20 పర్యాయాలు ఫిర్యాదు చేసినా స్పందనలేదని ఆరోపించారు. విగ్రహం ఏర్పాటుపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా కలెక్టర్ లెక్కచేయలేదని జేసీ విమర్శించారు.

“మా నాన్న స్వాతంత్ర్య సమరయోధుడు. దేశం కోసం పోరాడుతూ నాలుగు పర్యాయాలు రాయవెల్లూరు జైల్లో ఉన్నారు. రెండు సార్లు ఎంపీగా చేశారు. ఎమ్మెల్సీగా చేశారు, జిల్లా పరిషత్ చైర్మన్ గా చేశారు. ఆయన విగ్రహం పెట్టాలని నా వద్దకు చాలామంది వచ్చారు. విగ్రహం ఏర్పాటు చేయడం నాకు ఇష్టంలేదని చెప్పా. నచ్చని వాళ్లు కుళ్లిపోయిన వంకాయలో, చెప్పులో విగ్రహంపైకి విసురుతారు. లేదంటే కిరసనాయిలు పూస్తారు. మా నాన్నను ఆ విధంగా చూడాలని అనుకోవడంలేదు.

కానీ ఇవాళ ఏర్పాటు చేస్తున్న విగ్రహం ఓ అనామకుడిది. ఈ ఎమ్మెల్యేది పెద్ద దౌర్భాగ్యం. తండ్రి విగ్రహం సొంత చేతులతో ప్రారంభించుకోలేకపోయాడు. ఇరవైనాలుగు గంటలూ తాగి తూలుతుండే వ్యక్తితో మీ నాన్నకు ఓ దండ వేయించావు. ఆ విధంగా తండ్రిని అవమానించుకున్నావు” అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు.

Related posts

తుమ్మలతో టీఆర్ యస్ నాయకుల వరస భేటీల ఆంతర్యం ఏమిటి ?

Drukpadam

ఏపీ అసెంబ్లీ వద్ద ప్లకార్డులు చేతబట్టి బాలకృష్ణ నిరసన!

Drukpadam

సీఎంగా యెడియూరప్ప సమర్థంగా పనిచేస్తున్నారు: జేపీ నడ్డా!

Drukpadam

Leave a Comment