- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి విజయం
- తెలంగాణ భవన్ లో సంబరాలు
- బాణసంచా కాల్చుతుండగా ప్రమాదం
- హుటాహుటీన స్పందించిన అగ్నిమాపక సిబ్బంది
పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి గెలుపు సంబరాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాదు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ శ్రేణులు బాణసంచా కాల్చుతుండగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మంటలు భారీ ఎత్తున చెలరేగాయి. తెలంగాణ భవన్ లో ఓ అంతస్తు దగ్ధవుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన తెలంగాణ భవన్ వద్దకు చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. కార్యకర్తల అత్యుత్సాహమే ఈ ప్రమాదానికి దారితీసిందని భావిస్తున్నారు.
తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన పీవీ నరసింహరావు కుమార్తె సురభి వాణీదేవి తన సమీప ప్రత్యర్థి రాంచందర్ రావుపై నెగ్గారు. ఆమె హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో విజయకేతనం ఎగురవేశారు.
————————————————————-
వాణి దేవి విజయం
———————————————
హైద్రాబాద్ రంగారెడ్డి ,మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎన్నికలలో టీఆర్ యస్ అభ్యర్థి వాణీదేవి విజయం సాధించారు. ఆమె తన సమీప బీజేపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచందర్ రావుపై రెండవ రౌండ్ లెక్కింపులో 50 శాతం ఓట్లు ఎవరికీ రాకపోవటం తో మొదటి సాధారణ మైజార్టి 11,703 ఓట్లను పరిగణనలోకి తీసుకొని విజేతను ప్రకటిస్తారు. ఆమెకు సాధారణ మైజార్టి ఉన్ననందున ఎన్నికయ్యారు. అయితే అధికారికంగా ఫలితం ప్రకటించాల్సి ఉంది.
హైద్రాబాద్ రంగారెడ్డి ,మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వర్ ఎలిమినేషన్ అనంతరం ఇరువురు అభ్యర్ధులకు బదిలీ అయిన ఓట్లు:. వీణా దేవి- 1,49,269. రామచంద్రరావు- 1,37,566. గెలుపు కు కావలసిన 50%+1 ఇరువురిలో ఎవరికీ రాకపోవడంతో, ఇరువురిలో ఎక్కువ ఓట్లు ఉన్న TRS అభ్యర్ధిని వీణా దేవి సాధారణ మెజారిటీ తో ( 11,703 మెజారిటీతో)గెలుపుండరు. ఫలితాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది . దీంతో టీఆర్ యస్ శ్రేణులు సంబరాల్లో మునిగాయి. తెలంగాణ భవన్ లో జరిగిన సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది.