Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

‘రయ్’ మంటూ దూసుకుపోవద్దు!.. హైదరాబాద్ లో కొత్త వేగ పరిమితులు!

‘రయ్’ మంటూ దూసుకుపోవద్దు!.. హైదరాబాద్ లో కొత్త వేగ పరిమితులు!

  • కాలనీల్లో 35 కిలోమీటర్లే పరిమితి
  • మధ్యలో డివైడర్ ఉంటే 60 కిలోమీటర్లు
  • డివైడర్ లేకపోతే 50 కిలోమీటర్ల వేగమే
  • అవుటర్ పై 100 కిలోమీటర్లు
  • ట్రాఫిక్ పోలీసుల నిర్ణయం

జోరుగా, హుషారుగా అంటూ బైక్, కారుతో హైదరాబాద్ నగర రోడ్లపై దూసుకుపోయేవారు కొత్త నిబంధనల గురించి తెలుసుకోవాలి. వేగ పరిమితులను తగ్గిస్తూ ట్రాఫిక్ పోలీసు విభాగం నిర్ణయం తీసుకుంది. జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్) ఏవీ రంగనాథ్, మూడు పోలీసు కమిషనరేట్లకు చెందిన డీసీపీలు, హెచ్ ఎండీఏ, రవాణా శాఖ అధికారులు శనివారం భేటీ అయి కొత్త నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న వేగ పరిమితులు ఎక్కువ ప్రమాదాలకు దారితీస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు. అందుకనే వేగం తగ్గించడానికి తోడు, నగరవ్యాప్తంగా ఒకే విధమైన వేగ పరిమితులను అమల్లోకి తీసుకురావడం సరైనదిగా గుర్తించారు. ప్రస్తుతం రహదారి విస్తీర్ణం, రద్దీ ఆధారంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో వేగ పరిమితి అమల్లో ఉంది.

రోడ్డు మధ్యలో డివైడర్ ఉండి, రాకపోకలకు వేర్వేరు మార్గాలు ఉంటే.. కార్లు, జీపులు, ఎస్ యూవీలు, గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చు. బైక్ లు, స్కూటర్లు, ఆటోలు, బస్సులు, లారీలు, ట్రాలీ ఆటోలు (వాణిజ్య) గంటకు 50 కిలోమీటర్ల వేగానికి మించి వెళ్లకూడదు.

రోడ్డు మధ్యలో డివైడర్ లేకపోతే కార్లు, జీపులు, ఎస్ యూవీలు, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చు. బైక్ లు, స్కూటర్లు, ఆటోలు, బస్సులు, లారీలు, ట్రాలీ ఆటోలు (వాణిజ్య) గంటకు 40 కిలోమీటర్ల వేగానికి మించి వెళ్లకూడదు.

ఇక కాలనీలు, స్థానిక ప్రాంతాల్లోని కామన్ రోడ్లపై వాహనాలు 35 కిలోమీటర్ల వేగానికే పరిమితం కావాలి. అలాగే, అవుటర్ రింగ్ రోడ్డుపై గరిష్ఠంగా 100 కిలోమీటర్లు, పీవీ ఎక్స్ ప్రెస్ వేపై 80 కిలోమీటర్ల వేగానికి మించి వెళ్ల కూడదు. పరిమితికి మించి వేగంగా వెళ్లే వాహనాలను గుర్తించి చలాన్లు జారీ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు స్పీడ్ గన్ మెషిన్లను నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం గమనార్హం.

Related posts

నేనో ఫైల్యూర్ పొలిటిసిన్ ను …అంగీకరించిన పవన్ కళ్యాణ్!

Drukpadam

ఎమ్మెల్యే రోజా ఎక్కిన విమానంలో సాంకేతిక సమస్య తిరుపతిలో ల్యాండ్ అవ్వాల్సిన విమానం బెంగుళూర్ లో అయింది. 4 గంటలపాటు డోర్లు తెరుసుకోలేదు….

Drukpadam

ఏపీ నుంచి బిశ్వభూషణ్ వెళ్లడం బాధాకరం: సీఎం జగన్

Drukpadam

Leave a Comment