Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నన్ను చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు!

నన్ను చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు!
-ధర్మ సంరక్షణ కోసం పాటుపడుతున్న నన్ను హత్య చేసే కుట్ర
-బతికి ఉన్నంత వరకు ధర్మ సంరక్షణకు పాటుపడతా
-సంగారెడ్డి జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా వ్యాఖ్యలు

బీజేపీ లో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపే కుట్ర జరుగుతుందని పేర్కొనడం పై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ధర్మ సంరక్షణ కోసం కృషి చేస్తున్న తనను అంతమొందించే ప్రయత్నాలు జరుగతున్నాయని అన్నారు. సంగారెడ్డి జిల్లా గర్డేగావ్‌లో నిర్మించిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని డెగ్లూర్ పీఠాధిపతి చంద్రశేఖర్ మహారాజ్‌తో కలిసి నిన్న ఆవిష్కరించారు. అనంతరం రాజాసింగ్ మాట్లాడుతూ.. హిందూ ధర్మ రక్షణ అందరి బాధ్యత అని అన్నారు. అందుకోసం కృషి చేస్తున్న తనను హత్య చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

తాను బతికి ఉన్నంత వరకు ధర్మ సంరక్షణ కోసం పాటుపడతానని స్పష్టం చేశారు. కాగా, బీజేపీకి ఓటు వేయకుంటే బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయంటూ యూపీ ఓటర్లను ఉద్దేశించి రాజాసింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మంగళహాట్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఆయన యూపీ ఉండదల్చుకుంటే యోగి సర్కార్ కు ఓటువేలాయని బెదిరింపులకు పాల్పడ్డారని ఆయనపై అభియోగాలు నమోదు అయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ కేసు నమోదైంది. దీంతో ఆయన ఆరోపణలకు పదును పెట్టారు .

Related posts

ఢిల్లీకి వచ్చిన మంత్రులను అవమానిస్తున్నారు …మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్

Drukpadam

అమిత్ షా ఖమ్మం సభ ప్రతిష్టాత్మకం, జయప్రదం చేయండి …బండి సంజయ్..!

Drukpadam

ఉండవల్లి శ్రీదేవికి ఇది నా వ్యక్తిగత సలహా: డొక్కా మాణిక్యవరప్రసాద్

Ram Narayana

Leave a Comment