Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రశంశల జల్లు!

తెలంగాణ సీఎం కేసీఆర్ పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రశంశల జల్లు!
-తెలంగాణ సీఎం కేసీఆర్ కు తగిన సామర్థ్యాలు ఉన్నాయి
-అందరినీ కలుపుకుని పోగలరు
-రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలు చూశారు
-ఆయనకు నాయకత్వ సామర్థ్యాలు ఉన్నాయి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందరిని కలుపుకుని, ముందుకు నడిపించే సామర్థ్యాలు ఉన్నాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో ముంబైలో సమావేశమై బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయాలపై సమాలోచనలు చేయడం తెలిసిందే. దీనిపై సంజయ్ రౌత్ సోమవారం నాగపూర్ లో స్పందించారు. సీఎం కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు.

బీజేపీ వ్యతిరేక కూటమి కోసం కేసీఆర్ ఎంతో శ్రమిస్తున్నారని , బీజేపీ వ్యతిరేక పోరాటంలో కేసీఆర్ కు శివసేన పార్టీ పూర్తిగా సహకరిస్తుందని ఉద్ఘాటించారు. ఈ మేరకు తమనేత మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే తో కేసీఆర్ చర్చలు జరిపారని అందులో ఆయన విధానాలు బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టేందుకు చేస్తున్న కృషి తమను కట్టిపడేసింది అన్నారు . దేశంలో రానున్న రోజుల్లో రాజకీయాలు అత్యంత వేగంగా మారె అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు .

‘‘కే చంద్రశేఖర్ రావు ఎంతో కష్టపడి పనిచేసే రాజకీయ నేత. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అందరికనీ కలుపుకునిపోయే, నాయకత్వం వహించే సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి’’ అని సంజయ్ రౌత్ అన్నారు. ఇద్దరు సీఎంలు (కేసీఆర్,ఠాక్రే), ఇతర రాజకీయ నాయకులు త్వరలోనే సమావేశమై చర్చలు నిర్వహిస్తారని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఓటమి పాలు కాబోతోందని ఈ సందర్భంగా రౌత్ జోస్యం చెప్పారు .

Related posts

కేసీఆర్ ‘ఉపరాష్ట్రపతి’ అవుతున్నారన్న ప్రచారంపై కేటీఆర్ వివరణ!

Drukpadam

రఘురామ స్క్రిప్ట్ ఎక్సలెంట్ …

Drukpadam

ఏపీ బీజేపీ లో ఇంటర్నల్ వార్ …వీర్రాజుపై కన్నా లక్ష్మీనారాయణ ఫైర్!

Drukpadam

Leave a Comment