Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మంత్రి గౌతమ్ రెడ్డి మరణం తో తెలుగు రాష్ట్రాల్లో విషాదం …

మంత్రి గౌతమ్ రెడ్డి మరణం తో తెలుగు రాష్ట్రాల్లో విషాదం …
నివాళులు అర్పించిన సీఎం జగన్ ,చంద్రబాబు , కేటీఆర్ . పవన్ కళ్యాణ్
ఏపీ మంత్రులు ,ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు , ఎంపీలు
దుఃఖ సాగరంలో నెల్లూరు జిల్లా
భార్య భారతి తో సహా మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించిన జగన్

ఏపీ కి చెందిన యువ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. మచ్చలేని నాయకుడిగా తన మంత్రిత్వ శాఖను సమర్థవంతంగా నిర్వహించడంలో దిట్టగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇటీవలనే దుబాయ్ లో నిర్వహించిన ఆంతర్జాతీయ పారిశ్రామిక ఎక్స్పో లో ఏపీ స్టాల్ ఏర్పాటు చేసి ఏపీ కి పరిశ్రమలు వచ్చేందుకు కృషిచేసి నిన్ననే హైద్రాబాద్ కు తిరిగి వచ్చారు . ఎక్స్పో కు సంబందించిన విషయాలను సీఎం జగన్ కు తెలపాలిసి ఉంది. కానీ ఇంతలో ఆయన ఈ లోకాన్ని వీడి వెళ్లి పోవడం ఏపీ కి తీరని లోటుగానే ఉంటుందని పలువురు ప్రముఖులు నివాళులు ఆరోపించారు. అపోలో ఆసుపత్రిలో ఉదయం 9 గంటల 16 నిమిషాలకు తుది శ్వాస విడిచినట్లు వైదులు తెలిపారు . భౌతిక కాయాన్ని సందర్శించిన వారిలో సీఎం జగన్ , ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు , జనసేన అధ్యక్షలు పవన్ కళ్యాణ్ ,కాంగ్రెస్ నేత కెవిపి రామచంద్ర రావు , వైయస్ షర్మిల , విజయమ్మ , భారతి , తెలంగాణ మంత్రి కేటీఆర్ , పలువురు మంత్రులు , ఎంపీలు , ఎమ్మెల్సీలు , ప్రజాప్రతినిధులు ఉన్నారు .

 

హైద‌రాబాద్ చేరుకున్న జ‌గ‌న్‌.. మేక‌పాటికి క‌న్నీటి నివాళి

Jagan reached HyderabadTearful tribute to Mekapati

ఒక స్నేహితుడినే కాదు… సమర్థుడైన మంత్రిని కోల్పోయాను: సీఎం జగన్ ఆవేదన

  • క్యాబినెట్ సహచరుడు మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం పట్ల సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఒక స్నేహితుడినే కాదు, సమర్థుడైన మంత్రిని కోల్పోయానని ఆవేదన వెలిబుచ్చారు. గౌతమ్ రెడ్డి మృతి చెందారన్న వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. ఓ మంచి యువనేతను వైసీపీ కోల్పోవడం తీవ్రంగా కలచివేసిందని అన్నారు. గౌతమ్ తో తన అనుబంధం ఇప్పటిదికాదని, చిన్నప్పటినుంచే తెలుసని సీఎం జగన్ వెల్లడించారు.
ఏపీ ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి మేక‌పాటి గౌతమ్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో తెలుగు నేల‌లో విషాద ఛాయ‌లు నెల‌కొన్నాయి. రాజ‌కీయాల‌ను ప‌క్క‌న‌పెట్టి అన్ని పార్టీల‌కు చెందిన నేత‌లు మేక‌పాటికి నివాళి అర్పించేందుకు త‌ర‌లివస్తున్నారు. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా కాసేప‌టి క్రితం స‌తీస‌మేతంగా హైద‌రాబాద్ చేరుకుని నేరుగా మేక‌పాటి నివాసానికి వెళ్లారు. బెంగ‌ళూరులో ఉన్న త‌న స‌తీమ‌ణిని తీసుకుని హైద‌రాబాద్ వ‌చ్చిన జ‌గ‌న్ గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ మేక‌పాటి కుటుంబ స‌భ్యుల రోద‌న‌లు అంద‌రినీ క‌ల‌చివేశాయి.

జ‌గ‌న్‌ను చూడ‌గానే గౌత‌మ్ రెడ్డి త‌ల్లి బోరున విల‌పించారు. గౌత‌మ్ రెడ్డి స‌తీమ‌ణి, ఆయ‌న తండ్రి రాజ‌మోహ‌న్ రెడ్డి కూడా జ‌గ‌న్‌ను చూడ‌గానే.. బోరున విల‌పించారు. జ‌గ‌న్‌తో గౌత‌మ్ రెడ్డి అత్యంత స‌న్నిహితంగా మెల‌గిన క్ష‌ణాల‌ను గుర్తు చేసుకున్న ఆయ‌న కుటుంబ స‌భ్యులు జ‌గ‌న్ క‌నిపించ‌గానే.. ఒక్క‌సారిగా తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. త‌న‌ను చూసిన గౌత‌మ్ రెడ్డి కుటుంబ స‌భ్యులు బోరున విల‌పించ‌డాన్ని చూసిన జ‌గ‌న్ కూడా భావోద్వేగానికి గుర‌య్యారు. గౌత‌మ్ రెడ్డి పార్దివ దేహం ప‌క్క‌నే కుర్చీలో కూర్చున్న జ‌గ‌న్ క‌న్నీరు పెట్టుకున్నారు. త‌న ప‌క్క‌నే ఉన్న రాజ‌మోహ‌న్ రెడ్డిని జ‌గ‌న్ ఓదార్చ‌గా.. జ‌గ‌న్ స‌తీమ‌ణి వైఎస్ భార‌తి గౌత‌మ్ రెడ్డి త‌ల్లి, స‌తీమ‌ణిని ఓదార్చారు.

గౌత‌మ్‌రెడ్డి స్నేహపూర్వకంగా మెలిగేవారన్న‌ బాల‌కృష్ణ..

ఇంటిల్లిపాది దిగ్భ్రాంతికి గురయ్యామ‌న్న మోహన్ బాబు

 

balakrishna expresses condolences

ఏపీ మంత్రి మేక‌పాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం ప‌ట్ల ప‌లువురు రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు. గౌతమ్‌రెడ్డి ఇక లేరన్న మాట వినడానికే బాధగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఆయ‌న హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరితోనూ ఆయ‌న‌ స్నేహపూర్వకంగా మెలిగేవారని బాల‌కృష్ణ అన్నారు. ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేసేవారని, ఆయన సేవలు చిరస్మరణీయమ‌ని చెప్పారు.

గౌతమ్‌రెడ్డి మృతితో త‌మ‌ ఇంటిల్లిపాది దిగ్భ్రాంతికి గురయ్యామ‌ని సినీన‌టుడు మోహన్ బాబు అన్నారు. గౌతమ్‌రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్నాన‌ని ఆయ‌న చెప్పారు. గౌతమ్‌రెడ్డి కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు.

గౌతమ్‌రెడ్డితో తన అనుబంధం గురించి భావోద్వేగంగా స్పందించిన రోజా!

Goutham Reddy is like own brother to me says Roja

ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ గౌతమ్‌రెడ్డి తనకు సొంత సోదరుడు వంటివారని భావోద్వేగానికి గురయ్యారు. అత్యున్నత విద్యను అభ్యసించారని, ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయే స్వభావం కలిగినవారని చెప్పారు. ఆయన మరణం వైసీపీకి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి జగన్, గౌతమ్ రెడ్డి మంచి మిత్రులని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత గుండెపోటు వచ్చి చాలా మంది చనిపోయారని అన్నారు. చివరిసారిగా 20 రోజుల క్రితం తాను గౌతమ్‌రెడ్డితో మాట్లాడానని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan pays homage to Mekapati Goutham Reddy

అకాలమరణంపాలైన ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సందర్శించారు. హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని గౌతమ్ రెడ్డి నివాసానికి వెళ్లిన పవన్ నివాళులు అర్పించారు. తీవ్ర విషాదంలో ఉన్న గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అంతకుముందు పవన్ ట్విట్టర్ లో స్పందిస్తూ, గౌతమ్ రెడ్డి హఠాన్మరణం దిగ్భ్రాంతికరం అని పేర్కొన్నారు. రాష్ట్రమంత్రిగా ఎన్నో సేవలు అందించాల్సిన తరుణంలో కన్నుమూయడం బాధాకరమని పేర్కొన్నారు.

Related posts

జీవితాన్ని వదిలేసి.. మాతృభూమి నుంచి పారిపోతున్నా: అందరినీ కదిలిస్తున్న ఆఫ్ఘన్​ యువతి భావోద్వేగ పోస్ట్!

Drukpadam

నకిలీ వార్తల వ్యాప్తిపై కేంద్రం కొరడా.. 94 యూట్యూబ్ చానళ్లపై నిషేధం!

Drukpadam

చంద్రబాబుకు హెలికాప్టర్ ఆఫర్ చేశాం..ఆయన నిరాకరించారు: ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్

Ram Narayana

Leave a Comment