జైయహో తీన్మార్ మల్లన్న జైయహో
– గెలుపు ముంగిటకువచ్చి ఓడిన తీన్మార్ మల్లన్న
-రాజకీయ పండితుల అంచనాలు తారుమారు
-మల్లన్న కు జై కొట్టిన పట్టభద్రులు
-రాజకీయపార్టీలకు గుణపాఠం
తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఎన్నికలలో ఖమ్మం ,నల్లగొండ , వరంగల్ నియోజకవర్గం నుంచి పోటీచేసి హేమాహేమీలను ఖంగు తినిపించి గెలుపు అంచులదాకా వచ్చి ఓడిపోయారు. ఇప్పుడు ఏ నోటా విన్నా ఆయన మాటే . ఆయన పోటీ ఇచ్చిన తీరు అమోఘం ,అద్భుతం ,ఆశ్చర్యకరం ఒక సామాన్యుడు అసమాన్య పోటీనిచ్చి శభాష్ అనిపించుకున్నారు. ఓటర్లకు డబ్బులు ఇవ్వలేదు .పైసా ఖర్చు పెట్టలేదు. పేపర్లలో అడ్వటైజ్ మెంట్స్ ఇవ్వలేదు . ప్రజల తరుపున గొంతు వినిపించాడు . సాదాసీదాగా తిరిగాడు .వీడు పిచ్చోడులే అనుకున్నారు . ఆయన పోటీలోనే లేడు అనుకున్న పండితుల గుబగుయ్యిమనిపించేలా ఓటర్లు కరుణించారు . అందుకే అందరిని ఆయన ఆశ్చర్యపరిచాడు.
తీన్మార్ మల్లన్న కు అన్ని ఓట్లు వస్తాయని గానీ అంత పోటీ ఇస్తాడని గానీ ఎవరు ఊహించలేదు . అందరి ఊహలను తెలకిందులను చేస్తూ అన్ని జిల్లాలలో అన్నినియోజకవర్గాలలో ఆయన్ను పట్టభద్రులు అశ్వరదించారు.ఓట్ల వర్షం కురిపించారు. పట్టు ఉన్న జాతీయ పార్టీలను కాదని మల్లన్న పట్ల పట్టభద్రులు మొగ్గుచూపటం పై ప్రధాన రాజకీయ పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే . ఒక్కడుగా నిలిచాడు ఊరూరా తిరిగాడు .ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తన స్టైల్లో ప్రజలకు అర్థం అయ్యేలా వివరించారు.మల్లన్న ప్రచారాన్ని ఏ ప్రధాన పత్రిక చానళ్ళు కవర్ చేయక పోయిన సోషల్ మీడియా ను నమ్ముకున్న మల్లన్న చివరికి దాక అదే వరవడి కొనసాగించారు.పెట్రోల్,డీజిల్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న దోపిడీపై ఆయన వివరించిన విధానం ప్రజలను విఫరీతంగా ఆకట్టుకుంది. తన యాత్రల ద్వారా ,మాటలతో ప్రజలను ఆకర్షించారు. పోలింగు ముందు రోజు వరకు చెరుకు సుధాకర్, రాణి రుద్రమ లాగానే కొన్ని ఓట్లు వస్తాయని అనుకున్నారు. కానీ నల్లగొండ కౌంటింగ్ కేంద్రం లో బ్యాలట్ బాక్స్ లు తెరిచి లెక్కపెడుతుంటే మల్లన్న కు వస్తున్నా ఓట్లను చూసి ప్రత్యర్థులు కంగుతిన్నారు. మొదట ఒకటి రెండు రౌండ్లలో వచ్చిన తరువాత ఆయనకు ముందు ముందు రౌండ్లలో ఎందుకు వస్తాయిలే అనుకున్నారు. కానీ అన్ని రౌండ్లలో రావటమే కాదు. రెండవ ప్రాధాన్యత ఓట్లలో సైతం ఎక్కడా వెనక్కు తగ్గలేదు. రెండవ ప్రాధాన్యతలో ప్రొఫెసర్ కోదండరాం కు అధికంగా ఓట్లు వస్తాయని అనుకున్నారు. కానీ అందులో కూడా తీన్మార్ మల్లన్న వెనక పడలేదు. ఆయన ఓడినా, గెలిచినట్లే ననే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. అందుకే జయహో మల్లన్న అంటున్నారు.
previous post