Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీ కార్యకర్తలతో ప్రియాంక గాంధీ ఆశక్తికర సన్నివేశం

  • ప్రియాంక గాంధీతో షేక్ హ్యాండ్ కు ఎగబడిన బీజేపీ కార్యకర్తలు.. అడిగిన వెంటనే బ్రేస్ లెట్ ఇచ్చిన ప్రియాంక.. 

    • నిన్న లక్నోలో రోడ్ షో అనంతరం ఘటన
    • తిరిగి వెళ్తుండగా తారసపడిన బీజేపీ కార్యకర్తలు
    • కాంగ్రెస్ మేనిఫెస్టో అడిగి తీసుకున్న వైనం

    bjp యూపీ ఎన్నికల ప్రచారంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ అంటేనే ఉప్పు–నిప్పులా ఉంటాయి. అలాంటిది కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో షేక్ హ్యాండ్, సెల్ఫీల కోసం బీజేపీ కార్యకర్తలు ఎగబడ్డారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా నిన్న లక్నోలో రోడ్ షో ముగించుకుని ఆమె తిరిగి వెళ్తుండగా.. బీజేపీ ప్రచార సభకు వెళ్లి వస్తున్న ఆ పార్టీ కార్యకర్తలూ అదే దారిలో తారసపడ్డారు.

    దీంతో ఆమె కారు ఆపారు. బీజేపీ కార్యకర్తలు ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఎగబడ్డారు. మరికొందరు ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. కొందరు బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ మేనిఫెస్టోను అడిగి తీసుకున్నారు. ఇంకో యువకుడు వచ్చి ఆమె వేసుకున్న బ్రేస్ లెట్ ను అడగ్గా.. ఆమె కాదనకుండా ఇచ్చేశారు.

    ఆ వీడియోను కాంగ్రెస్ యూపీ విభాగం ట్వీట్ చేసింది. రాజకీయాల్లో ఇలాంటి చిత్రాలు చాలా అరుదని పేర్కొంది. యువత ఇప్పుడు గొడవలు, విద్వేషాలను కోరుకోవడం లేదని, ఉద్యోగాలు కావాలంటున్నారని, అందుకు బీజేపీ ప్రచార సభకు వెళ్లి వస్తున్న ఈ యువతే నిదర్శనమని ట్వీట్ లో పేర్కొంది.

Related posts

జైల్లో పెట్టినా ,నిషేదించిన నాపోరాటం ఆగదు…రాహుల్ గాంధీ…!

Drukpadam

రాహుల్ గాంధీతో జ‌గ్గారెడ్డి భేటీ…

Drukpadam

గుజరాత్ సీఎం రేసులో ముందున్నప్రఫుల్ ఖోదా పటేల్, ఆర్‌సీ ఫాల్దు ?

Drukpadam

Leave a Comment