Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అమూల్ పాల ధ‌ర పెంపు.. రేప‌టి నుంచే అమ‌ల్లోకి

అమూల్ పాల ధ‌ర పెంపు.. రేప‌టి నుంచే అమ‌ల్లోకి

  • ప్ర‌స్తుతం అమూల్ గోల్డ్ అర లీట‌ర్ ధ‌ర రూ.28
  • దానిని రూ.30కి పెంచుతూ నిర్ణ‌యం
  • త‌న బ్రాండ్‌కు చెందిన అన్ని ఉత్ప‌త్తుల ధ‌ర‌లు పెంచుతున్న‌ట్లు వెల్ల‌డి
  • మార్చి 1 నుంచే పెంచిన ధ‌ర‌లు అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని ప్ర‌క‌ట‌న‌

ప్రముఖ పాల విక్రయసంస్థ  అమూల్.. తాజాగా అన్ని ర‌కాల పాల ధ‌ర‌ల‌ను పెంచుతున్న‌ట్లుగా సోమ‌వారం ప్ర‌క‌టించింది. లీట‌ర్ పాల‌పై ఏకంగా రూ.4 పెంచుతూ అమూల్ నిర్ణ‌యం తీసుకుంది. అంతేకాకుండా త‌న అన్ని ఉత్ప‌త్తుల ధ‌ర‌లు పెంచుతున్నామ‌ని కూడా అమూల్ ప్ర‌క‌టించింది.

ప్ర‌స్తుతం అమూల్ గోల్డ్ పాలు అర లీట‌ర్ ధ‌ర రూ.28గా ఉంది. దీనిని ఒకేసారి రూ.30కి పెంచుతున్న‌ట్లు అమూల్ ప్ర‌క‌టించింది. అర లీట‌ర్ ధ‌ర రూ.2 పెరిగితే.. లీట‌ర్ పాల ధ‌ర రూ.4 పెరిగిన‌ట్టే క‌దా. పెరిగిన ధ‌ర‌లు మార్చి 1 (మంగ‌ళ‌వారం) నుంచే అమ‌ల్లోకి రానున్న‌ట్లుగా అమూల్ తెలిపింది. పాల ధ‌ర‌ల‌తో పాటు త‌న బ్రాండ్‌కు చెందిన అన్ని ఉత్ప‌త్తుల ధ‌ర‌లు కూడా పెరిగాయ‌ని, పెరిగిన ధ‌ర‌లు మంగ‌ళ‌వారం నుంచే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని కూడా అమూల్ ప్ర‌క‌టించింది.

Related posts

షిర్డీ సాయిబాబా ఆలయానికి సీఐఎస్ఎఫ్ భద్రత.. నిరసనగా మే 1 నుంచి నిరవధిక బంద్..

Drukpadam

పోల‌వ‌రం బ్యాక్ వాట‌ర్‌తో తెలంగాణ‌కు ముంపు ఉంది … ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ ర‌జ‌త్ కుమార్!

Drukpadam

దక్షిణ ఢిల్లీలో మాంసం దుకాణాలు బంద్.. అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం!

Drukpadam

Leave a Comment