Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బడా బూర్జవపార్టీల విధానాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. –తమ్మినేని

బడా బూర్జవపార్టీల విధానాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. –తమ్మినేని
-అవకాశవాద విధానాలతో ప్రాంతీయ పార్టీలు పూటకొక విధానంతో ప్రజలను మోసం చేస్తున్నాయి
-రాష్ట్రవ్యాప్తంగా 9 నియోజకవర్గాలపై సిపిఎం కేంద్రీకరణ –
-అమెరికా సామ్రాజ్యవాద ఫలితమే యుద్ధాలు
-సీపీఐ(ఎం) స్టేట్ వర్క్ షాప్ లో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

బడా బూర్జువా పార్టీల విధానాల విషయంలో సద అప్రమత్తం గా ఉండాలని సీపీఐ(ఎం) శ్రేణులకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. బీజేపీ అత్యంత ప్రమాదకర పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సైతం దీనికి ఏమాత్రం తీసిపోదన్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్న జేజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ పార్టీలు అవకాశవాద విధానాలను అనుసరిస్తున్నాయని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 9 నియోజకవర్గాలపై పార్టీ కేంద్రీకరణ చేసినట్లు చెప్పారు. ఖమ్మంలోని మంచికంటి మీటింగ్ హాల్లో మంగళ, బుధవారాల్లో నిర్వహించే పార్టీ రాష్ట్రస్థాయి వర్క్ షాప్ను ఉద్దేశించి తమ్మినేని మాట్లాడారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ వర్క్ షాప్ భారత కమ్యూనిస్టు పార్టీ (మారిస్టు) 23వ అఖిల భారత మహాసభ ముసాయిదా రాజకీయ తీర్మానంపై తమ్మినేని క్లుప్తంగా వివరించారు. అమెరికా సామ్రాజ్యవాద ఫలితంగానే యుద్ధాలు సంభవిస్తున్నాయన్నారు. నాటోను అడ్డుపెట్టుకుని రష్యాపై ఆధిపత్యం సాధించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఉక్రెయిన్- రష్యా యుద్ధమని వివరించారు. ఉక్రెయిన్ను నాటో కూటమిలో చేర్చాలని అమెరికా ప్రయత్నిస్తోందన్నారు. దీన్ని రష్యా ధిక్కరిస్తోందన్నారు. కమ్యూనిస్టు చైనా అభివృద్ధి చెందుతుండటం అమెరికాకు కంటగింపుగా మారిందన్నారు.

– జాతీయ రాజకీయ విధానం

జాతీయ రాజకీయ విధానంపై తమ్మినేని మాట్లాడుతూ మతోన్మాద బీజేపీ ఈ దేశానికి అత్యంత ప్రమాదకారి అని చెప్పారు. రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని సైతం మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. లౌకిక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రయివేటుకు కట్టబెడుతోందని తెలిపారు. సామాజిక న్యాయం అనే అంశాన్ని ఎప్పుడో తుంగలో తొక్కేసిందన్నారు. మహిళలను అస్సలు మనుషులుగా చూడటం లేదని తెలిపారు. ఫలితంగానే హిజాబ్ ధరించివద్దని ఆంక్షలు విధించిందని చెప్పారు.

రాజ్యాంగానికి ఉన్న ఫెడరల్ లక్షణాన్ని సైతం దెబ్బతీస్తోందన్నారు. రాష్ట్రాల హక్కులను హరించి వేస్తోందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలోని వ్యవసాయం, విద్యావంటి కీలక అంశాలను సైతం లాక్కుందన్నారు. జీఎస్టీ తెచ్చి రాష్ట్రాలు పన్నులు వేసుకునే హక్కులు కూడా లేకుండా చేసిందన్నారు. సీబీఐ, ఈడీ వంటి కేంద్రప్రభుత్వరంగ సంస్థలు, చివరకు సుప్రీంకోర్టును సైతం తన చెప్పుచేతల్లోకి తీసుకుందన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు బీజేపీని అడ్డుకునేలా పార్టీ రాజకీయ విధానం ఉందన్నారు. బీజేపీతో పాటు మరో బ బూర్జువా పార్టీ కాంగ్రెస్ విషయంలోనూ వ్యతిరేక వైఖరి అవలంభించాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలో ఒకదానికి మద్దతు ఇవ్వాల్సి వస్తే కాంగ్రెస్కు సపోర్టు చేయాల్సి ఉంటుందన్నారు. ప్రాంతీయ పక్షాలు అవకాశవాద పార్టీలుగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. కేసీఆర్, జగన్, చంద్రబాబు ఏ ప్రాంతీయ పార్టీ నేతయినా సరే అవకాశవాద వైఖరితోనే వ్యవహరిస్తారన్నారు. అధికారంలో ఉన్న పార్టీతో సంబంధాలు ఉండకూడదనే విధానాన్ని ముసాయిదాలో ప్రతిపాదించారని తెలిపారు. పొత్తులపై ఎన్నికల సమయంలోనే మాట్లాడుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారించాలని 2021 ఆగష్టులో నిర్ణయించామన్నారు. ఈ మేరకు కార్యాచరణ ఎలా ఉందో ఈ వర్గాల్లో చర్చించాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆహ్వానించిన ప్రతినిధులు ఈ వర్క్ షాప్కు హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి. వెంకట్, పోతినేని సుదర్శన్, జాన్ వెస్లీ , రాష్ట్ర నాయకులు మీడియం బాబూరావు, పార్టీ ఖమ్మం, భద్రాద్రి జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, అన్నవరపు కనకయ్య, వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

తిరుపతి సభలో జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కిషన్‌రెడ్డి!

Drukpadam

మోదీ బాధ నిజ‌మే అయితే బీరేన్ సింగ్‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేసి ఉండేవారు: మ‌ల్లికార్జున ఖ‌ర్గే..

Drukpadam

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక బూటకం: కేజ్రీవాల్….

Drukpadam

Leave a Comment