Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణలో ఆంధ్రా అధికారుల పెత్తనం ఏమిటి ? పీపుల్స్ మార్చ్ లో భట్టి!

తెలంగాణలో ఆంధ్రా అధికారుల పెత్తనం ఏమిటి ? పీపుల్స్ మార్చ్ లో భట్టి!
తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ ల పట్ల చిన్న చూపు
విశ్రాంత ఉద్యోగులకు కీలక పదవులు
ప్రజా సంపదను పంచుకుంటున్న పాలకులు
మిషన్ భగీరథ పేరిట టిఆర్ఎస్ దోపిడి
అవినీతి పాలన అంతానీకే పీపుల్స్ మార్చ్
పాదయాత్రలో సర్కారును తూర్పారబట్టిన భట్టి

ఆత్మగౌరవం దక్కాలని…కొలువులు కావాలని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర కేడర్ ఐఏఎస్ లకు పెద్ద పీట వేయడమేంటని తెలంగాణ ప్రభుత్వాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఇదేనా ఆత్మగౌరవం అంటే అని నిలదీశారు . మన నిధులు ,మన నియామకాలు , మన పాలన అంటే ఇదేనా అంటూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, ఏసీబీ డీజీ అంజనీకుమార్ లు మొదలుకొని అనేక కీలక శాఖలను ఆంధ్ర కేడర్ ఐఏఎస్ అధికారులకు అప్పగించి తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ లను చిన్న చూపు చూడడంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సర్కార్ ను నిలదీస్తానని వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారానికై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర బుధవారం నాలుగో రోజుకు చేరుకుంది. ముదిగొండ మండలం ఖానాపురం, పండ్రేగుపల్లి, కోదండరాంపూర్, ముత్తారం, వివి కిష్టపురం, మల్లారం గ్రామాల్లో భట్టి విక్రమార్క పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఆత్మగౌరవం కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా టిఆర్ఎస్ పరిపాలన సాగుతుందని ధ్వజ మెత్తారు. పరిపాలన వ్యవస్థలో నిర్మాణాత్మకమైన నిర్ణయాలు తీసుకునే దానిలో అందరూ క్యాడర్ అధికారులు ఉండటంవల్ల తెలంగాణ ప్రజలకు ఎలా ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణ సాధించుకున్న ఆంధ్ర పరిపాలన కొనసాగడానికి పాలకుల ప్రయోజనాలు దాగి ఉన్నాయన్న అనుమానాలు తెలంగాణ సమాజంలో వ్యక్తమవుతున్నాయని వివరించారు.
రాష్ట్రంలో చేపడుతున్న భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రిటైర్డ్ అధికారి మురళీధర్ రావును ఈఎన్సీ నియమించడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాలకులు ప్రజా సంపదను దోపిడీ చేయడానికై తెలంగాణ అధికారులను పక్కనపెట్టి ఆంధ్ర అధికారులకు పెత్తనం ఇవ్వడంతోపాటు, విశ్రాంతి ఉద్యోగుల అయిన తమ బంధువులను తీసుకొచ్చి కీలక పదవులు ఇస్తున్నారని విమర్శించారు.

15లక్షల కోట్ల ప్రజా సంపద ఏమైంది

తెలంగాణ సాధించిన 8 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దాదాపు 15 లక్షల కోట్ల వరకు ఉందని ఈ సంపద ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నాలుగు కోట్ల ప్రజలకు చెందాల్సిన సంపదను పాలనలో ఉన్న కొద్దిమంది పందికొక్కుల్లా తింటున్నారని విమర్శించారు. “ఎంతకాలం ఈ దోపిడీ… మరి ఇంకెంతకాలం ఈ అవినీతి. మీరు దోపిడీ చేసుకోవడానికి నా సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది. అవినీతి పాలన అంతం చేయడానికే పీపుల్స్ మాత్రం మొదలు పెట్టానని” భట్టి విక్రమార్క ప్రకటించారు. రైతులు కూలీలు నిరుద్యోగులు మహిళలు యువకులు విద్యార్థులు అందరూ ఆర్థికంగా బాగుపడటానికి సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన పాలకులు బంగారు తెలంగాణ చేస్తామని ప్రగల్బాలు పలికి వారు మాత్రమే బంగారం అయ్యారని విమర్శించారు.

రూ. 50 వేల కోట్ల దోపిడీ

ఇంటింటికి మంచి నీళ్లు ఇస్తామని మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం 50 వేల కోట్లకు పైగా దోపిడీకి తెరలేపింది అని ఆరోపించారు. కెసిఆర్ ముఖ్యమంత్రి కాకముందే ఉమ్మడి రాష్ట్రంలోనే మధిర నియోజకవర్గంలో ఇంటింటికి మంచినీటిని అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. మంచినీటి సరఫరాకు ప్రతి మండలంలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు అన్ని గ్రామాల్లో మంచినీటి ట్యాంకులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిచిందన్నారు. అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ట్యాంకులకు మిషన్ భగీరథ పేరిట
రంగులు మార్చి ప్రజా సంపదను దోచుకున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకాన్ని నిర్వీర్యం చేసి రేషన్ దుకాణాలు తెలంగాణ ప్రభుత్వం బియ్యం దుకాణం గా మార్చిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 9 నిత్యావసర సరుకులను టిఆర్ఎస్ సర్కార్ ఎందుకు ఇవ్వడం లేదని అని ప్రశ్నించారు. ఆడబిడ్డ పెళ్లీడు వచ్చేనాటికి మూడు లక్షలు వచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బంగారుతల్లి పథకాన్ని తీసుకు రాగా అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ కళ్యాణ లక్ష్మి పథకం పెట్టి కేవలం లక్షా 16 వేలు మాత్రమే ఇస్తూ గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు గా ఉందని విమర్శించారు.

విక్రమార్క పాదయాత్రకు అద్దంకి దయాకర్ సంఘీభావం

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు పిసిసి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ బుధవారం సంఘీభావం ప్రకటించారు. ముదిగొండ మండలం కోదండ రామ పూర్ లో పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భట్టి విక్రమార్క తో కలిసి దయాకర్ పాల్గొన్నారు.

పంట చేలు పక్కన సేదతీరిన భట్టి విక్రమార్క

ప్రజా సమస్యల పరిష్కారానికై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర) బుధవారం నాలుగో రోజు ముదిగొండ మండలం ఖానాపురం, పండ్రేగుపల్లి, కోదండరాంపూర్ గ్రామాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మండుటెండను సైతం లెక్కచేయకుండా కాలినడకన ఆ గ్రామాల్లో ప్రతి గడపను తట‌్టారు. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం అనంతరం గ్రామ శివారులో ఉన్న మొక్కజొన్న పంట చేను పక్కన గ్రామస్తులు మడత మంచం వేయడంతో కొంత సేపు సేద తీరారు. ఆ తర్వాత కాలినడకన వి.వి కిష్టాపురం కు బయలు దేరి వెళ్లారు.

Related posts

మమతా బెనర్జీపై కేంద్రం ఆగ్రహం… ప్రధాని మీకోసం వేచి చూడాలా అని మండిపాటు

Drukpadam

పోలీసులు అడ్డుకోవడంతో అనపర్తికి కాలి నడకన చంద్రబాబు!

Drukpadam

ప్రతిపక్షాలకు తనదైన శైలిలో ప్రధాని మోదీ కౌంటర్​!

Drukpadam

Leave a Comment