తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. భగ్నం చేసిన సైబరాబాద్ పోలీసులు
- పేట్ బషీరాబాద్ లో పలువురి అరెస్ట్
- సుపారీ కిల్లర్స్ గా భావిస్తున్న పోలీసులు
- ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగినట్టు తెలుస్తోంది. ఈ కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. పేట్ బషీరాబాద్ లో కొందరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై కాసేపట్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వివరాలు తెలపనున్నారు.
కాగా, పేట్ బషీరాబాద్ లో పట్టుబడినవారు సుపారీ కిల్లర్స్ అని భావిస్తున్నారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. ఏకంగా ఓ మంత్రినే చంపేందుకు సిద్ధమవడం సంచలనం సృష్టిస్తోంది. మంత్రి హత్యకు కుట్ర వెనుక ఎవరెవరు ఉన్నారన్నది దర్యాప్తులో బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీలో ఉన్నారు.