Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వైసీపీ కి చెందిన 49 మంది ఎమ్మెల్యే లు 9 మంది ఎంపీ లు వేరే పార్టీతో టచ్ లో ఉన్నారు :శివాజీ

 

వైసీపీకి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు వేరే పార్టీతో టచ్ లో ఉన్నారు: సినీ నటుడు శివాజీ

  • అమరావతిపై హైకోర్టు కీలక తీర్పు
  • మందడం వద్ద దీక్షా శిబిరంలో సంబరాలు
  • ఈసారి వైసీపీ గెలవదన్న శివాజీ 
  • ఓటుకు రూ.50 వేలు ఇచ్చినా కష్టమేనని వ్యాఖ్య  

రాజధాని అమరావతిపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మందడంలో రైతుల దీక్షా శిబిరం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా టాలీవుడ్ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు మరో పార్టీతో టచ్ లో ఉన్నారని, వారంతా పక్క చూపులు చూస్తున్నారని అన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు దారుణమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ మూడు రాజధానులు అంటూ ఎన్నికలకు వెళతారని… అమరావతి అంశం, ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు అంశం ఏమైందని మనం ప్రశ్నించాలని శివాజీ పిలుపునిచ్చారు. ఓటుకు రూ.50 వేలు ఇచ్చినా ఈసారి వైసీపీ గెలిచే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. పనిచేసేవారికే ఈసారి రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని శివాజీ పేర్కొన్నారు.

 

Related posts

దేశవ్యాపితంగా కాంగ్రెస్ కవాత్…తెలంగాణాలో రేవంత్ ,భట్టి పాదయాత్రలు!

Drukpadam

కేంద్ర బడ్జెట్ పై వెరైటీగా స్పందించిన చంద్రబాబు ….

Drukpadam

ఏప్రిల్ నెలలో హైదరాబాదులో రూ.2,230 కోట్ల మేర ఇళ్ల కొనుగోళ్లు!

Drukpadam

Leave a Comment