Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

వివేకా హత్య కేసు: సీబీఐ నోటీసులు తీసుకోని వైయస్ అవినాశ్ రెడ్డి!

వివేకా హత్య కేసు: సీబీఐ నోటీసులు తీసుకోని వైయస్ అవినాశ్ రెడ్డి!
వైయస్ వివేకా హత్య కేసులో అవినాశ్, ఆయన తండ్రికి సీబీఐ నోటీసులు
నోటీసులు తీసుకోవడానికి నిరాకరించిన తండ్రీకొడుకులు
కడప జిల్లా కోర్టును ఆశ్రయించిన సీబీఐ

మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు 207 మందిని విచారించిన సీబీఐ అధికారులు… 146 మంది వాంగ్మూలాలు తీసుకున్నారు. మరోవైపు పలువురు ఇచ్చిన వాంగ్మూలాల్లో ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిల పేర్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో, వారిని విచారించేందుకు సీబీఐ సిద్ధమైంది.

ఈ క్రమంలో ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం పరిధిలోని స్పెషల్ క్రైమ్స్ మూడో విభాగం అధికారులతో పాటు మరికొందరు ముఖ్య అధికారులు నిన్న పులివెందులకు చేరుకున్నారు. సీబీఐ విచారణకు హాజరుకావాలని అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రికి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా వాటిని తీసుకునేందుకు వారు నిరాకరించినట్టు సమాచారం. దీంతో, కడప జిల్లా కోర్టును వారు ఆశ్రయించినట్టు తెలుస్తోంది. కోర్టు అనుమతితో ఈరోజు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

వివేకా హత్యతో అవినాశ్ కు సంబంధం లేదు.. విచారణ తప్పుదోవ పడుతోంది: బాలినేని

 

వివేకా హత్య కేసు దర్యాప్తును న్యాయంగా చేయాలి
అవినాశ్ ను విచారించాల్సిన అవసరం లేదు
రాబోయే ఎన్నికల్లో వైసీపీ 160 స్థానాల్లో గెలుస్తుంది

మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. ఇప్పటికే ఎంతో మంది వాంగ్మూలాలను సీబీఐ అధికారులు నమోదు చేశారు. మరోవైపు వైసీపీ ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసును న్యాయంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ హత్యతో అవినాశ్ కు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. అవినాశ్ ను విచారించాల్సిన అవసరం లేదని అన్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తు తప్పుదోవ పడుతోందనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యేంత వరకు అసెంబ్లీలో అడుగుపెట్టబోనని అన్నారని… జీవితంలో చంద్రబాబు మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టడని ఆరోజే తాము అనుకున్నామని బాలినేని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీ 160 స్థానాల్లో గెలుస్తుందని జోస్యం చెప్పారు. అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం జగన్ న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అమరావతికి సంబంధించి నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం చేయలేని పనులను… మూడు నెలల్లో తమ ప్రభుత్వం ఎలా చేయగలదని ప్రశ్నించారు.

Related posts

వివేకా హత్యలో సంచలన విషయాలు … 40 కోట్ల డీల్ …ప్రధాన నిందితుడు ఎర్రం గంగి రెడ్డి!

Drukpadam

ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీస్ అధికారుల రిమాండ్…!

Ram Narayana

పంజాబ్ లో ఉద్రిక్త‌త‌లు.. మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్‌ సేవల నిలిపివేత‌!

Drukpadam

Leave a Comment