Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీకి గుడ్ న్యూస్‌!.. పోల‌వ‌రం ఖ‌ర్చంతా కేంద్రానిదే!

ఏపీకి గుడ్ న్యూస్‌!.. పోల‌వ‌రం ఖ‌ర్చంతా కేంద్రానిదే!
పోల‌వ‌రం ఏపీకి జీవ‌నాడి
ప్రాజెక్టు నిర్మాణం ఖ‌ర్చంతా కేంద్రానిదే
స‌వరించిన అంచ‌నాల‌ను ఏపీ ఇవ్వ‌ట్లేదు
అంచ‌నాలు అందాక ఆమోదిస్తాం
కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి షెకావ‌త్ వెల్ల‌డి

కేంద్ర జ‌ల శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ నోట నుంచి ఏపీ ప్ర‌భుత్వానికి శుభ వార్త అందింది. పోలవ‌రం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే మొత్తం ఖ‌ర్చును కేంద్ర‌మే భ‌రిస్తుంద‌ని షెక‌వాత్ తెలిపారు. ఈ మేర‌కు పోల‌వరం ప్రాజెక్టును సంద‌ర్శించిన సంద‌ర్భంగా మాట్లాడిన షెకావ‌త్ ఏపీ సీఎం జ‌గ‌న్ సమ‌క్షంలోనే ఈ ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీకి జీవ‌నాడిగా పోల‌వ‌రాన్ని అభివ‌ర్ణించిన షెకావ‌త్‌… జాతీయ హోదా క‌లిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్య‌యం మొత్తాన్ని కేంద్ర‌మే భ‌రిస్తుంద‌ని ప్ర‌క‌టించారు.

రెండు రోజుల ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన షెకావ‌త్ శుక్ర‌వారం ఉద‌యం జ‌గ‌న్‌తో క‌లిసి పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించారు. ప్రాజెక్టు నిర్మాణ ప‌నుల‌తో పాటు నిర్వాసిత కాల‌నీల‌ను కూడా ఆయ‌న సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన షెకావ‌త్‌.. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, సవాళ్లను పరిశీలించానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒక్కొక్క రాయికి అయ్యే ఖర్చును చెప్పిన ప్రకారమే కేంద్రం భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అని తెలిపారు. ప్రాజెక్టుకు సవరించిన అంచనాల విషయంలో రాష్ట్రం ఇవ్వాల్సిన వివరాలు ఇవ్వటం లేదని.. వివరాలు ఇచ్చిన తర్వాత నిధులను ఆమోదించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.

కేంద్ర‌మంత్రితో క‌లిసి జ‌గ‌న్ పోల‌వ‌రం పర్య‌ట‌న‌

కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ తో క‌లిసి ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌ద్ద ప‌ర్య‌టిస్తున్నారు. ముందుగా దేవీప‌ట్నం మండ‌లం ఇందుకూరు-1కు వారు చేరుకున్నారు. అక్క‌డి పున‌రావాస కాల‌నీలో ప్ర‌జ‌ల‌తో వారు మాట్లాడుతున్నారు. పోల‌వ‌రం నిర్వాసితులు త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకుంటున్నారు. పునరావాస కాలనీలో అన్ని వ‌స‌తులు క‌ల్పించిన‌ట్లు కేంద్ర మంత్రి షెకావత్ అన్నారు.

పోలవరం పూర్తి చేసే అంశంపై కేంద్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని, తాను మ‌రోసారి కూడా ఇక్క‌డ‌ పర్యటిస్తాన‌ని ఆయ‌న చెప్పారు. నిర్వాసితులతో మాట్లాడిన అనంత‌రం ప్రాజెక్టు పనులు పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో స‌మావేశ‌మై కొన‌సాగుతోన్న ప‌నుల‌పై చ‌ర్చ‌లు జ‌రుపుతారు.

కాగా, దేవీపట్నం మండలం ఏనుగుల పల్లి, మంటూరు, అగ్రహారం గ్రామాల వారి కోసం ఇందుకూరు -1 కాలనీని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. కేంద్ర మంత్రి షెకావత్, సీఎం జ‌గ‌న్‌తో పాటు ఏపీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కూడా ఈ ప‌ర్య‌ట‌న‌లో పాల్గొంటున్నారు.

Related posts

రాజస్థాన్ లో భారీ లిథియం నిల్వలు.. ఆనంద్ మహీంద్రా కీలక సూచన…!

Drukpadam

మేక‌పాటి ఫ్యామిలీ దాతృత్వం.. గౌతమ్‌రెడ్డి పేరిట అగ్రి వ‌ర్సిటీ!

Drukpadam

ఖమ్మంలో పిడుగుపడి రెండుకార్లు నుజ్జు నుజ్జు ..

Drukpadam

Leave a Comment