Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పక్క రాష్ట్రాల క్యాబ్ లు మా పొట్ట కొడుతున్నాయి.. పోలీసులకు తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల ఫిర్యాదు!

పక్క రాష్ట్రాల క్యాబ్ లు మా పొట్ట కొడుతున్నాయి.. పోలీసులకు తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల ఫిర్యాదు

  • హైదరాబాద్ రోడ్లపై 500 వరకు క్యాబ్ లు
  • అగ్రిగేటర్ల సాయంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సేవలు
  • తగ్గిపోతున్న మా ఆదాయం
  • క్యాబ్ డ్రైవర్ల గగ్గోలు
  • వాటిని అడ్డుకోవాలని డిమాండ్

పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ట్యాక్సీలు, క్యాబ్ లు తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయంటూ హైదరాబాద్ ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల సంయుక్త కార్యాచరణ కమిటీ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పొరుగు రాష్ట్రాలకు చెందిన క్యాబ్ డ్రైవర్లు హైదరాబాద్ నగరంలోకి ప్రవేశిస్తూ.. స్థానికంగా క్యాబ్ లను నమ్ముకుని బతుకుతున్న వారి జీవనోపాధిని దెబ్బతీస్తున్నట్టు తమ వినతి పత్రంలో పేర్కొన్నారు. కనీసం 500 వరకు పొరుగు రాష్ట్రాల క్యాబ్ లు హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్నట్టు చెప్పారు.

‘‘కరోనా మహమ్మారి రెండేళ్ల పాటు డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీసింది. ఇప్పుడు పరిస్థితి కాస్త మెరుగుపడిందనుకుంటే, మరో సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. క్యాబ్ అగ్రిగేటర్లు (ఓలా, ఊబర్ తదితర) పొరుగు రాష్ట్రాల నుంచి క్యాబ్ లను అద్దెకు తీసుకుని ఇక్కడ నడిపిస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి’’అని సంయుక్త కార్యాచరణ కమిటీ చైర్మన్ షేక్ సలావుద్దీన్ పేర్కొన్నారు.

నిబంధనలను ఉల్లంఘించిన అగ్రిగేటర్లు, డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని క్యాబ్ డ్రైవర్లు పోలీసులను కోరారు. ఎంతో పోటీ కారణంగా ఆదాయం కోల్పోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగేటర్ల యాప్ ల సాయంతో తెలంగాణలో తిరుగుతున్న ఇతర రాష్ట్రాల క్యాబ్ లను గుర్తించి వాటిని నిలిపివేయాలని కోరారు.

Related posts

 కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం.. లోక్ సభ స్పీకర్ కు నోటీసులు

Ram Narayana

ఈజిప్ట్ …ఇసుకలో సమాధి అయిన 3 వేల ఏళ్ల నాటి నగరం.. 

Drukpadam

ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ప్రధాని మోదీకి, నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞతలు…సీఎం చంద్రబాబు

Ram Narayana

Leave a Comment