Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

భారత్ లో మరో సారి కరోనా విజృంభణ…

భారత్ లో మరో సారి కరోనా విజృంభణ…
-అప్రమత్తమైన అధికారులు
-లాక్ డౌన్ దిశగా పలు రాష్ట్రాలు
-ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూ లు
ఏపీ లో కరోనా కలకలం
-తెలంగాణాలో ఆందోళన
రాజమండ్రిలో ఓ కాలేజీలో 163 మందికి కరోనా పాజిటివ్
700 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించిన వైద్యబృందం
కంటైన్మెంట్ జోన్ గా ప్రకటన
భారత్ లో కరోనా మరోసారి విజృంభిస్తుంది . కేసుల సంఖ్యలో ప్రపంచంలోనే మూడవ స్థానంలో భారత్ నిలిచింది. ప్రపంచంలోని 221 దేశాలలో 12 కోట్ల 38 లక్షల 77 వేల 64 మందికి కరోనా సోకింది. వారిలో 27 లక్షల 34 వేల 702 చనిపోయారు. వాటిలో మొదటి ఒకటి ,రెండు స్థానాలలో అమెరికా, బ్రెజిల్ ఉన్నాయి. మూడవ స్థానంలో భారత్త ఉంది . అమెరికాలో 3 కోట్ల ఐదు లక్షల మందికి కరోనా భారీన పడగా వారిలో ఇప్పటివరకు 5 లక్షల 55 వేల , 870 మంది చనిపోగా , బ్రెజిల్ లో కోటి 20 లక్షల మందికి రాగ , 2 లక్షల 95 వేల 685 మంది చనిపోయారు. భారత్ లో కోటి 16 లక్షల 86 వేల ,300 మందికి వ్యాధిరగా ,లక్ష 60 వేల 199 మంది సోమవారం వరకు చనిపోయారని లెక్కలు చెబుతున్నాయి. తరువాత ,రష్యా , యూ కె , ఫ్రాన్స్ , ఇటలీ , స్పైయిన్ , టర్కీ , జర్మనీ నిలిచాయి. అభివృద్ధి చెందిన దేశాలలో సైతం లక్షలాది మరణాలు సంభవించాయి . వ్యాక్సిన్ వచ్చింది మరేం ఫరవాలేదు అనుకుంటున్న తరుణంలో మరో సరి మహమ్మారి తన ప్రతాపం చూపిస్తుంది. ఇది ముమ్మాటికీ అంటువ్యాధే కావటంతో ఒకరినుంచి మరొకరికి వేగంగా సోకె ఆవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మొత్తుకున్నా సరైన జాగ్రత్తలు తీసుకోవటంలో ప్రజల నిర్లక్యం కొత్త వచ్చినట్లు కనపడుతుంది. గత రెండుమూడు నెలలుగా కొంత తగ్గుముఖం పట్టిందని అనుకుంటున్న తరణంలో తిరిగి కరోనా విజృంభించటంతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ , మధ్యప్రదేశ్ ,గోవా ,రాజస్థాన్ ,గుజరాత్ లాంటి రాష్ట్రాలలో కొన్ని నిబంధనలు అములు అవుతున్నాయి. కొన్ని చోట్ల రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. మరికొన్ని రాష్ట్రాలలో పబ్లిక్ ఫంక్టన్ లను నిషేదించారు. స్కూల్స్ , కాలేజీ లు , రెస్టారెంట్ , హోటల్స్ , మూసివేశారు. తెలుగు రాష్ట్రాలలో కూడా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఖమ్మం జిల్లా లోని ముదిగొండ మండలం పెద్దమండవ గ్రామంలో 10 మంది స్కూల్ విద్యార్థులకు కరోనా సోకిందనే వార్తలు కలకలం రేపాయి. దీంతో జిల్లా అధికార యంత్రంగం అప్రమత్తమైంది. తెలంగాణలో ఇప్పటికే పలు విద్యాసంస్థలు, వసతి గృహాల్లో కరోనా వ్యాప్తి తీవ్రతరం కావడం తెలిసిందే. తాజాగా ఏపీలోనూ అదే స్థాయిలో కరోనా విజృంభణ కనిపిస్తోంది. రాజమండ్రిలోని ఓ కాలేజీలో ఏకంగా 163 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. శనివారం ఈ కాలేజీలో 13 కేసులు రాగా, ఆదివారం 10 కేసులు వెలుగుచూశాయి. సోమవారం నాడు ఒక్కరోజే 140 పాజిటివ్ కేసులు రావడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
దీనిపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ గౌరీనాగేశ్వరరావు స్పందిస్తూ… 700 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు జరిపామని వెల్లడించారు. పాజిటివ్ విద్యార్థులను ఒకే ప్రదేశంలో ఉంచి, ఆ ప్రదేశాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించామని వివరించారు. కరోనా సోకని విద్యార్థులను మరో హాస్టల్ లో ఉంచినట్టు వివరించారు.
హైదరాబాదులోని అనేక వసతిగృహాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. ఉస్మానియా వర్సిటీలో సైతం కరోనా ఉనికి వెల్లడైంది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కరోనా బారినపడుతుండడంతో విద్యాసంస్థల కొనసాగింపుపై రేపు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టత ఇవ్వనున్నారు. కొన్ని ఆంక్షలు పెట్టె ఆలోచనలో ఇప్పటికే ప్రభుత్వం ఉంది. దీనిపై ఉన్నతాధికారులతో సమీక్షా నిర్వహించనున్నారు. తరువాత ప్రకటన వచ్చే ఆవకాశం ఉంది.

Related posts

ముంబై ప్రజలను ఇబ్బంది పెట్టిన జియో.. 8 గంటల పాటు పనిచేయని నెట్ వర్క్!

Drukpadam

కీవ్ వీధుల్లో భీకర పోరు.. ఆయుధాలు వీడే ప్రసక్తే లేదన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ!

Drukpadam

కాలికి గాయంతో వీల్ చెయిర్లోనే పార్లమెంటుకు వచ్చిన శశి థరూర్!

Drukpadam

Leave a Comment