Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తుమ్మల , పొంగులేటి తో జూపల్లి భేటీ …రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు !

తుమ్మల , పొంగులేటితో   జూపల్లి భేటీ… రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు  !
-రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేతల భేటీలపై ఇంటలిజెన్స్ ఆరా !
-వారి అడుగులు వేటు వైపు అనేదానిపై ఆశక్తి
-టీఆర్ యస్ లో అన్యాయం జరిగిందంటున్న అనుయాయిలు
-కార్యకర్తల్లోనూ తీవ్ర అసంతృప్తి

మరో సంవత్సరమా ? లేక ఆర్నెలలోన ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ,కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లుతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్నా నేపథ్యంలో టీఆర్ యస్ లో సముచిత స్తానం దక్కని సీనియర్లు సమాలోచనలు ప్రారంభించారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు చెందిన మాజీమంత్రి సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు , మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీమంత్రి జూపల్లి కృష్ణరావు ప్రత్యేకంగా ఖమ్మం వచ్చి కలవడం ప్రాధాన్యత సంతరించుకున్నది . ప్రజల్లో బలం బలగం ఉన్న నాయకులు కావడం కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా పర్యటన రోజునే వీరి కలయిక జరగటంతో వారి మధ్య జరిగిన సంభాషణలపై పరిశీలకులు కూపీ లాగుతున్నారు. తుమ్మల , పొంగులేటి పలుమార్లు తమకు పార్టీ మారె ఆలోచన లేదని చెబుతున్నప్పటికీ వారిపైన ఇటు పార్టీలోనూ , ప్రజల్లోనూ ఒక క్లారిటీ ఉంది. తుమ్మల జిల్లాలో అభివృద్ధి ప్రధాతగా పేరుంది. ఖమ్మం జిల్లా అభివృద్ధిలో ఆయన పాత్రను ఎవరు కాదనలేని సత్యం .ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన కొంతకాలానికి కేసీఆర్ ఆహ్వానం మేరకు తెలుగుదేశం నుంచి టీఆర్ యస్ లో చేరి కేసీఆర్ కాబినెట్ లో మంత్రిగా కొనసాగారు . 2018 లో
ఓటమి పాలైన తుమ్మలను కేసీఆర్ దూరంగా ఉంచుతున్నారు . అయితే ఇటీవల ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఆర్థిక , ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తుమ్మల గెస్ట్ హౌస్ లోనే మకాం వేశారు . వారి మధ్య ఏకాంతంగా చర్చ జరిగింది. తుమ్మల తరచూ జిల్లాలో పర్యటిస్తూ తన అనుయాయులు , ముఖ్యులను కలుస్తూ , వారి ఇళ్లలో జరిగే కార్యక్రమాలకు హాజరౌతున్నారు. తిరిగి టీఆర్ యస్ టికెట్ ఇస్తే పాలేరు నుంచి పోటీచేయాలని పట్టు దలతో ఉన్నారు .

ఇక మరో ముఖ్యనేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీచేసిన మొదటి సారినే ఖమ్మం ఎంపీ గా వైయస్ ఆర్ కాంగ్రెస్ తరుపున పోటీ చేసి విజయం సాధించారు . రాష్ట్ర విడిపోయిన తరవాత ఆయన కూడా టీఆర్ యస్ లో చేరారు . అయితే ఆయనకు ఇచ్చిన కమిట్ మెంట్ కు విరుద్ధంగా తిరిగి ఎంపీ సీటు ఇవ్వలేదు . తరువాత రాజ్యసభ ఇస్తామని అన్నారని ప్రచారం జరిగింది. కానీ అది ఇవ్వలేదు . పైగా కాంగ్రెస్ నుంచి టీఆర్ యస్ లో చేరిన మాజీ స్పీకర్ కె ఆర్ సురేష్ రెడ్డి కి ఇచ్చారు . ప్రతి సారి ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని ప్రచారం జరగటం ,అది రాకపోవడం షరా మాములుగా మారింది. దీంతో అసంతృప్తిగా ఉన్న ఆయన హితులు సన్నిహితులు మాత్రం ఆయనపై పార్టీ మారాలని వత్తిడి తెస్తూనే ఉన్నారు . ఆయన షషే మీరా అంటున్నారు .

జూపల్లి కృష్ణారావు ఇక్కడకు వచ్చి వీరువురు నేతలను కలవడంపై రాజకీయవర్గాల్లో దుమారం రేగుతుంది. ప్రత్యేకంగా ఆయన వారిని కలవడంలో ఉద్దేశం ఏమిటి ? సీనియర్ నేతలు అందరు ఒక్కటిగా ఆలోచన చేస్తున్నారా ? అనే సందేహాలు కలుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు కూడా వీరు కదలికలు పై నిఘా ఉంచినట్లు సమాచారం . వారి దగ్గరకు ఎవరెవరు వస్తున్నారు . ఎవరిని కలుస్తున్నారు . అనేదానిపై ఎప్పటికప్పడు సమాచారం తెప్పించుకుంటున్నారు. జూపల్లి తిరిగి కాంగ్రెస్ లో చేరబోతున్నారా ? వారి అభిప్రాయాలూ కూడా తెలుసుకునేందుకు వెళ్ళారా ? అనే సందేహాలు బలపడుతున్నాయి. పొంగులేటి తో జూపల్లి చర్చల్లో తుళ్లూరు బ్రమ్మయ్య , మువ్వా విజయ్ బాబు , పిడమర్తి రవి పాల్గొన్నారు . తుమ్మల మాత్రం సింగిల్ గానే పాల్గొన్నట్లు సమాచారం . ఇది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏమి జరుగుతుందో చూద్దాం మరి !

Related posts

ద్రౌపదికే నా మద్దతు.. విపక్షాలు నన్ను సంప్రదించలేదు: మాయావతి!

Drukpadam

పోలవరం విలీన మండలాల పర్యటనకు చంద్రబాబు… 

Drukpadam

మెత్త బడ్డ సిద్దు రాజీనామా వెనక్కి …? సీఎం తో భేటీ …

Drukpadam

Leave a Comment