Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఉద్యోగ ప్ర‌క‌ట‌న స‌రే.. ఎప్ప‌టిలోగా భ‌ర్తీ చేస్తారు?: రేవంత్ రెడ్డి

ఉద్యోగ ప్ర‌క‌ట‌న స‌రే.. ఎప్ప‌టిలోగా భ‌ర్తీ చేస్తారు?: రేవంత్ రెడ్డి

  • బిస్వాల్ క‌మిటీ నివేదిక‌లో 1.91ల‌క్ష‌లు ఖాళీ
  • కేసీఆర్ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం 80 వేలు ఖాళీ
  • ఉద్యోగాల ప్ర‌క‌ట‌న‌పై రేవంత్ రెడ్ది ఫైర్  

తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌పై ఇప్పుడు పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. దాదాపుగా అన్ని పార్టీలు కూడా కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌పై స్పందించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. కేసీఆర్ ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌పై ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు స్పందించ‌గా..కాసేప‌టి క్రితం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఉద్యోగ ప్ర‌క‌ట‌న బాగానే ఉంది గానీ… ఆ ఉద్యోగాల భ‌ర్తీని ఎప్ప‌టిలోగా పూర్తి చేస్తారో చెప్ప‌నే లేదంటూ రేవంత్ విమర్శించారు.

రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీల‌పై 2014 సెప్టెంబ‌ర్ 7న టీఆర్ఎస్ చేసిన ప్ర‌క‌ట‌న‌ను గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. నాడు 1.07 ల‌క్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ‌ని, మ‌రో 50 వేలు ఖాళీ అవుతున్నాయ‌ని చెప్పార‌న్నారు. అదే లెక్క మేర అంటే.. 1.50 ల‌క్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని కూడా నాడు కేసీఆర్ చెప్పార‌ని రేవంత్ గుర్తు చేశారు.

‘బిస్వాల్ కమిటీ రాష్ట్రంలో 1.91 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ‌ని చెప్పింది. మరి కేసీఆర్ 80 వేల ఉద్యోగాలు మాత్ర‌మే ఖాళీగా ఉన్నాయ‌ని సభలో అబద్ధం చెప్పారు. మ‌రి మిగిలిన ఉద్యోగాలను కాకులు ఎత్తుకుపోయాయా?’ అంటూ రేవంత్ ప్ర‌శ్నించారు.

Related posts

ఫైజర్ ,మోడర్న్ లు తమ వ్యాక్సిన్లు నేరుగా అమ్మలేమని చెప్పాయి: కేజ్రీవాల్…

Drukpadam

కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కొండా సురేఖకు దక్కని చోటు!

Drukpadam

కుప్పంలో వైసీపీ ఆటలు సాగవు ఎప్పటికి చంద్రబాబే ఎమ్మెల్యే :నారా లోకేష్ !

Drukpadam

Leave a Comment