Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమితో కమలంలో బేజారు…

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమితో కమలంలో బేజారు…
-రెండు స్థానాల్లో మేమె గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేసింది
-ఉన్న స్థానం పోగొట్టుకున్నది
-హైద్రాబాద్,రంగారెడ్డి , మహబూబ్ నగర్ లలో రెండవ స్థానంలో నిలిచినా
-నల్లగొండ ,ఖమ్మం ,వరంగల్ స్థానంలో నాలుగవ స్థానం పొందింది.
ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత బీజేపీ వాయిస్ తగ్గింది. తమదే అధికారం అని చెబుతున్న కమల నాథులు బేజార్ లో ఉన్నారా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు .ఉన్న హైద్రాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని పోగొట్టుకుని దిగాలు పడింది . అందువల్ల బీజేపీ పై పెద్దగా ఆశలు పెట్టుకోవడం అత్యాశే అవుతుందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. దుబ్బాక ఉపఎన్నికలలో టీఆర్ యస్ నుంచి సిట్టింగు ఎమ్మెల్యే స్థానం చేజిక్కించుకొని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అధికార టీఆర్ యస్ కు సవాల్ విసిరింది. ఒక సందర్భంలో బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందనే ప్రచారం కూడా జరిగింది. దీంతో ఒక్కసారిగా బీజేపీ..,బీజేపీ అనే ప్రచారమా జరిగింది. ఇక్కడ కేసీఆర్ కు ఆల్టర్ నేటివ్ బీజేపీనే అని ప్రజలు భావించారు. కేంద్రంలో అధికారంలో ఉండటంతో కేసీఆర్ ను ఎదుర్కొనగలిగే శక్తి ,దమ్ము దైర్యం ,దానికే ఉన్నదని నమ్మకం కలిగించారు. టీఆర్ యస్ పాలనపట్ల వ్యతిరేకంగా ఉన్న వారు బీజేపీకి జైకొట్టేందుకు సిద్ధమైయ్యారు. దీంతో రాష్ట్రం రాజకీయాలలో ఒక్కసారిగా అనూహ్య మార్పులు వస్తావని పరీశీలకులు భావించారు. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఇక్కడ నాయకుల దూకుడుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . దీంతో నాయకులు రెచ్చిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆయన పాలన మీద పార్టీ అధ్యక్షడు బండి సంజయ్ తనదైన శైలిలో విమర్శల గుప్పించారు .బీజేపీకి రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉందని 2023 లో జరిగే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణాలో తమదే అధికారం అనే వరకు వెళ్ళింది .వచ్చే ఎన్నికల్లో అధికారం బీజేపీకి దక్కే ఆవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలూ ఇటీవల కాలంలో సర్వత్రా వినిపించాయి. అనేక మంది వివిధ పార్టీలలోని ముఖ్యనాయకులు బీజేపీ లో చేరేందుకు ఉత్సహం చూపారు. రాజకీయ పండితులు సైతం బీజేపీ తెలంగాణాలో బాగా బలపడుతుందని భావించారు. చివరకు అధికార టీఆర్ యస్ పార్టీ కూడా కాంగ్రెస్ కన్నా బీజేపీ తో తమకు ఇబ్బందులు ఉంటాయని , దానితోనే తమకు పోటీ ఉంటుందని విమర్శల దాడి మొదలు పెట్టింది. కేంద్ర ప్రభుత్వం పై ఆపుడప్పుడు విమర్శలు ఎక్కుపెడుతుంది. అయితే అవి స్థిరంగా ఉండటంలేదనే అభిప్రాయాలూ ఉన్నాయి. దీనిపై సీఎం స్పందన మరోలా ఉంది. మనది ఫెడరల్ వ్యవస్థ అయినందున కేంద్రం చేసే చట్టాలను అమలు చేయక తప్పదని వారితో కలిసి పనిచేయాల్సిందేనని సమర్ధించుకుంటున్నారు . టీఆర్ యస్ ,బీజేపీల మధ్య కొన్ని సార్లు కయ్యం మరికొన్ని సార్లు నెయ్యం కొనసాగుతుండటంతో అందులో చేరదాం అనుకున్న నాయకులు వెనక ముందు ఆడుతున్నారు.
వ్యవసాయ చట్టాలను తొలుత తీవ్రంగా వ్యతిరేకించిన కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని ని కలిసి వచ్చిన తరువాత దానిపై మాట్లాడటం మానేశారు. బండి సంజయ్ కూడా దుబ్బాక,గ్రేటర్ హైద్రాబాద్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా వ్యవహరించనంత దూకుడుగా వ్యవహరించటంలేదు.
తెలంగాణాలో అధికారంలో ఉన్న టీఆర్ యస్ పై ప్రజలలో అసంతృప్తి ఉన్నదనే మాట నిజం .అది అనేక సందర్భాలలో నిరూపితమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలిచినప్పటికీ ఆపార్టీ ఊహించిన విధంగా ఫలితాలు లేవు అనేది వాస్తవం . అధికారం ఉండి ,డబ్బు ఖర్చుచేస్తే గానీ మొదటి ప్రాధాన్యతలో ఆ మాత్రం ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం తెలంగాణ సమాజం ఆల్టర్ నేటివ్ రాజకీయాల వైపు చేస్తుందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి . దాన్ని ఎవరు భర్తీ చేయగలరు అనేది ఇప్పుడు ప్రజల ముందున్న ప్రశ్న . అందువల్లనే బీజేపీ లో చేరాలని అనుకున్న కాంగ్రెస్ కు చెందిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఆలోచనలో పడ్డారు. ముందు బీజేపీలో చేరదాం అనుకున్నా తానే కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఒకే సామాజిక వర్గానికి చెందిన షర్మిల ,విశ్వేశ్వరరెడ్డి లు వేరువేరుగా పార్టీలు పెడితే ఎంతవరకు సక్సెస్ అవుతారనే అభిప్రాయాలూ కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు కుల రాజకీయాలు రాజకీయ వర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. ఎవరి కులం వారు అధికారంలో ఉన్నారు. ఎవరు కులం అధిరంలోకి రాబోతోందనే లెక్కలు వేస్తున్నారు. కొన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సైతం కులాలవారీగా పార్టీలలో ప్రాధాన్యత ఇస్తున్నాయి. బడుగు బలహీన వర్గాల వారు సైతం రాజకీయాలలో తమకు వాటా కావాలనే డిమాండ్ చేస్తున్నారు. 50 శాతం పైగా ఉన్న తమకు పదవుల పంపకాల్లో జరుగుతున్నా అన్యాయాలపై ప్రశ్నిస్తున్నారు. అన్ని పార్టీలు బడుగు ,బలహీనవర్గాలు , దళితులూ,మైనార్టీల ఓట్ బ్యాంకుపై కన్నేసి వారికోసం ఎన్నో చేస్తున్నామని ప్రకటించినా, రాజకీయాల్లో మాత్రం వారికీ స్థానం చివరనే ఉంటుందనే అభిప్రాయాలూ ఆవర్గాలలో ఉన్నాయి. మంద కృష్ణ ,చెరుకు సుధాకర్ ,రాణి రుద్రమ ,లాంటి వారికీ పార్టీలు ఉన్నాయి.పట్టభద్రుల ఎన్నికల్లో అందరిని ఆశ్చర్యపరిచిన తీన్మార్ మల్లన్న వైపు అందరిచూపు మళ్లింది . అందువల్ల రానున్నకాలంలో బీజేపీ రాష్ట్రాల్లో ప్రత్యాన్మాయం కోసం ఎలాటి వ్యూహాలు రచిస్తుందో చూడాల్సిందే !!!

 

 

 

 

 

Related posts

పొంగులేటి నిర్ణయం ఆలశ్యం సరే …ఆమోదయోగ్యంగా ఉంటుందా….?

Drukpadam

ప్రధాని రేసులో మోడీ, రాహుల్ మధ్యనే పోటీ…..

Drukpadam

ఇలాంటి రాక్షసులకు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలి?: సీఎం జగన్ మండిపాటు

Ram Narayana

Leave a Comment