Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ పని అయిపోయిందా ?..కేంద్రంలో అధికారం కలేనా ??

కాంగ్రెస్ పని అయిపోయిందా ?..కేంద్రంలో అధికారం కలేనా ??
గ్రాండ్ ఓల్డ్ పార్టీకి చికిత్స అవసరమా ?
సీనియర్ల డిమాండ్లు ఏమిటి ?
గాంధీ కుటుంబం తప్పుకోవాలా?

కాంగ్రెస్ పార్టీ నిజంగానే గ్రాండ్ ఓల్డ్ పార్టీ …సుదీర్ఘ కాలం పాటు దేశాన్ని పాలించిన పార్టీ .దేశానికి స్వతంత్రం తీసుకోని రావడంలో ప్రముఖ పాత్ర వహించిన పార్టీ …అలాంటి పార్టీ పని అయిపోయిందా ? ఇక కేంద్రంలో అధికారంలోకి రావడం కలేనా అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి . ఈ వాదనలకు కారణం లేకపోలేదు .ఒకప్పుడు కాశ్మిర్ నుంచి కన్యాకుమారి వరకు దేశాన్ని అప్రతి హతంగా వేలిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం కోల్పోవడమే కాకుండా ,రాష్ట్రాలలోను పట్టు కోల్పోయి కేవలం రెండు రాష్ట్రాలలో మినుకు మిణుకుమంటున్నది . అధికారంలో ఉండగా అంతా ఆహా ,ఓహో అన్న నేతలు అవకాశవాదం ,డబ్బు సంపాదనకోసం కాంగ్రెస్ నుంచి జంప్ అవుతున్నారు . బీజేపీ అంటే మత పిచ్చి పార్టీ అన్న నేతలు అది అధికారంలో ఉండటంతో ఇదే దేశానికి దిక్కు ఇంతకంటే గొప్ప పార్టీ లేదని అంటున్నారు. .వాస్తవానికి ఇప్పటికి దేశవ్యాపితంగా అన్ని రాష్ట్రాలతో సంబంధాలు ఉండి క్యాడర్ ఉన్న పార్టీ కాంగ్రెస్.బీజేపీ కి ప్రత్యాన్మాయ పార్టీ గా ఇప్పటికి కాంగ్రెస్ కు మాత్రమే అవకాశం ఉంది.

మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రధాన పార్టీగా పోటీ ఇచ్చింది. అందులో ఒకదానిలో  ఆప్ తో ప్రధాన పోటీ జరిగింది.పంజాబ్ లో కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీని ముంచాయి. ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ సిద్దు వ్యవహార శైలి ,ఒంటెత్తు పొగడలు ఎన్నికలకు ముందే పార్టీని అస్థిరపరిచి ,బలహీన పరిచాయి. ఇక ఉత్తర ఖండ్ లో బీజేపీ అధికారంలో ఉండటమే కాకుండా కేంద్రంలో అధికారంలో ఉండటం కాంగ్రెస్స్ లో అంతర్గత కుమ్ములాటలు కలిసొచ్చాయి. గోవా లో హోరా హోరి ఫైట్ చేసింది. టీఎంసీ ఆప్ లాంటి పార్టీలు కాంగ్రెస్ రాకుండా బీజేపీ కి పరోక్ష సహకారం చేశాయి . మణిపూర్ లో కాంగ్రెస్ గట్టి పోటీని ఇచ్చింది . ఒక్క ఉత్తర ప్రదేశ్ లో మాత్రం అధికారం అందనంత దూరంలో ఉంది .అక్కడ ప్రియాంక మకాం వేసి నప్పటికీ బీజేపీ ,ఎస్పీ మధ్య పోరులో మిగతా పార్టీలను ఓటర్లు పట్టించుకోలేదు .

అందువల్ల కాంగ్రెస్ నాలుగు రాష్ట్రాల్లో ప్రధాన పోటీదారుగా ఉన్న విషయాన్నీ విస్మరించరాదు . అదే సందర్భంలో కాంగ్రెస్ లో ఉండి అనేక పదవులు అనుభవించిన కొందరు నేతలు పార్టీ మీద గాంధీ కుటుంబం మీద నెపం వేసి వెళ్లి పోవడంపై కూడా విమర్శలు ఉన్నాయి.

సీనియర్ల డిమాండ్ ఏమిటి ?

గెలుపోటములు సహజం …దాన్ని సమీక్షించుకోవడంలో తప్పులేదు … కానీ ఓటమిని అంతా గాంధీ కుటుంబం మీద నెట్టి గెలుపుంత మాదేనని చెప్పడంతోనే అభ్యంతరాలు ఉన్నాయి. సీనియర్లుగా చెప్పబడుతున్న 23 నేతలు గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారనే అభిప్రాయాలూ ఉన్నాయి. వారు పార్టీ లో ఎన్నికలు జరగాలని అంటున్నారు. పార్టీ ప్రక్షాళన జరగాలని అంటున్నారు . గాంధీ కుటుంబ యేతర వ్యక్తికి ఐసీసీ అధ్యక్ష భాద్యతలు అప్పగించాలని అంటున్నారు .అయితే అందరు కలిసి ఒకనిర్ణయానికి రాకుండా కొందరు తమ అభిప్రాయాలను లేఖ ద్వారా రాయడం పార్టీని డేమేజ్ చేసిందనే అభిప్రాయాలూ ఉన్నాయి. జి -23 గా పిలవబడుతున్న వారిలో కొందరు ముఖ్యులు బీజేపీ ఫోల్డ్ లోకి వెళ్లారనే అభిప్రాయాలూ సైతం ప్రచారంలో ఉన్నాయి.

గాంధీ కుటుంబం తప్పుకోవాలా ?

గాంధీ కుటుంబం ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలనుంచి తప్పుకోవాలా ? అప్పుడు ఎవరు అధ్యక్షలు అవుతారు ? నిజంగా పార్టీలో టాప్ టు బాటమ్ అది కోరుకుంటుందా? అనేది ఇక్కడ సమస్య .వాస్తవానికి పార్టీ శ్రేణులు అధికోరుకోవడంలేదు . ఇప్పుడు కొందరు కోరుకున్నట్లుగా కాంగ్రెస్ కార్యకర్తల్లోగాని , ఓటర్లలోగానే గాంధీ కుటుంబాన్నే కోరుకుంటున్నారు. మరి జి -23 నేతలు కొత్త అధ్యక్షున్ని పెట్టి ఐసీసీని ప్రక్షాళన చేసి తిరిగి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చే మంత్ర దండం ఉందా? అనేదే ఇక్కడ సమస్య …చూద్దాం ఏమిజరుగుతుందో ….

Related posts

మేం ఏం చేయాలో చెప్పడానికి నువ్వేమీ మా వ్యూహకర్తవి కాదు: పవన్ కల్యాణ్ పై కొడాలి నాని ఫైర్!

Drukpadam

బొత్స సంగతి సరే… చంద్రబాబు దగ్గర నువ్వేం చేస్తున్నావు?: పేర్ని నాని!

Drukpadam

టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు…

Drukpadam

Leave a Comment